ఖబరస్థాన్ రహదారి మూసిన ఫారెస్ట్ అధికారులు

ఖబరస్థాన్ రహదారి మూసిన ఫారెస్ట్ అధికారులు

1
TMedia (Telugu News) :

ఖబరస్థాన్ రహదారి మూసిన ఫారెస్ట్ అధికారులు
టీ మీడియా, జూన్ 21, రామకృష్ణాపూర్:
రవీంద్రఖని రైల్వే స్టేషన్ సమీపంలో ఉన్నటువంటి ముస్లిం సోదరుల కబారస్థాన్ వెళ్లకుండా ప్రహరీ గోడను మూసి వేసిన ఫారెస్ట్ అధికారులు దాని కారణంచేత దహన సంస్కార చేయుటకు చాల ఇబ్బంది పడవలసి వస్తుంది గత 40 సంవత్సరాల క్రితం రామకృష్ణాపూర్ ముస్లిం మైనార్టీ సోదరులు కబరస్తాన్ కోసం 2 ఎకరాలు భూమిని కొనుగోలు చేయడం జరిగింది.దానికి 25 సంవత్సరాల క్రితం అప్పటి తెలుగుదేశం ప్రభుత్వం పార్లమెంటు సభ్యురాలు చెలిమల సుగుణ కుమారి ఎంపీ ల్యాండ్స్ నిధుల నుండి చుట్టు ప్రహరీ గోడ నిర్మించి గేట్ ఏర్పాటు చేసి ఇవ్వడం జరిగింది. ప్రస్తుతం దాని లోపలికి వెళ్లకుండా గేట్ తీసి వేసి గోడను నిర్మించడంవల్ల లోపలికి వెళ్లేందుకు పొలాల నుండి నడుచుకుంటూ వెళ్ళవలసి పరిస్థితి ఏర్పడింది.

Also Read : అర్ధరాత్రిఆందోళన విరమించిన విద్యార్థులు

కావున స్థానిక ఎమ్మెల్యే బాల్క సుమన్ గారి దృష్టికి ఈ సమస్యను తీసుకో వెళ్ళటం జరిగింది. వెంటనే ఈ సమస్యను పరిష్కరించి స్థానిక ప్రజలు గాంధారి వనంలొ వాకింగ్ చేయడానికి వాకర్స్ కు ఇబ్బంది లేకుండా లోపలికి ప్రవేశించే విధంగా గేట్ ఏర్పాటు చేసి ముస్లిం సోదరులకు దహన సంస్కరణలు చేసే విధంగా చర్యలు తీసుకొని న్యాయం చేయవలసిందిగా రామకృష్ణాపూర్ ముస్లిం మైనారిటీ వెల్ఫేర్ కమిటీ అధ్యక్షులు అబ్దుల్ అజిజ్, ప్రధాన కార్యదర్శి డాక్టర్ సలీంన్, సలహాదారులు అక్బర్ అలీ, ఖాజా షరీఫ్ ,షఫీ ఖాజా, పాషా,అన్వర్, ఖలీం తదితరులు కోరడం జరిగింది.

for telugu news live alerts like, follow and subscribe TMedia on FacebookTwitterYouTube