11 గంటలపాటు శ్రీవారి ఆలయం బంద్‌

11 గంటలపాటు శ్రీవారి ఆలయం బంద్‌

1
TMedia (Telugu News) :

11 గంటలపాటు శ్రీవారి ఆలయం బంద్‌

టి మీడియా, నవంబరు 7, తిరుమల: కలియుగ ప్రత్యక్షదైవం తిరుమల శ్రీవారి క్షేత్రం మరోసారి మూతపడనుంది. ఈరోజు చంద్రగ్రహణం సంభవించనుండటంతో ఆలయాన్ని సుమారు 11 గంటలపాటు మూసివేయనున్నారు. ఉదయం 8.40 నుంచి రాత్రి 7.20 గంటల వరకు శ్రీవారి ఆలయ తలుపులు మూసివేయనున్నారు. మంగళవారం మధ్యాహ్నం 2.39 నుంచి సాయంత్రం 6.27 గంటల వరకు చంద్రగ్రహణం ఉంటుంది. ఇటీవలే పాక్షిక సూర్యగ్రహణం కారణంగా శ్రీ వేంకటేశ్వర స్వామివారి ఆలయాన్ని మూసివేసిన విషయం తెలిసిందే.

Also Read : నో” ఫైర్ సేఫ్టీ

చంద్రగ్రహణం కారణంగా ఈనేపథ్యంలో వీఐపీ బ్రేక్‌ దర్శనాలను టీటీడీ రద్దు చేసింది. ఇందులోభాగంగా నేడు ఎలాంటి సిఫారసు లేఖలు స్వీకరించబోమని స్పష్టం చేసింది. బ్రేక్‌దర్శనాలు, ఆర్జితసేవలు, రూ.300 ప్రత్యేక ప్రవేశ దర్శన టికెట్లను కూడా రద్దు చేసింది. రాత్రి 7.30 గంటలకు ఆలయ తలుపులు తెరిచి.. శుద్ధి చేసిన తర్వాత వైకుంఠం-2 క్యూకాంప్లెక్స్‌ ద్వారా భక్తులను స్వామివారి దర్శనానికి అనుమతిస్తారు.

for telugu news live alerts like, follow and subscribe TMedia on FacebookTwitterYouTube