భారత్‌లో రెండు ట్విట్టర్ కార్యాలయాల మూసివేత
టీ మీడియా, ఫిబ్రవరి 17, న్యూఢిల్లీ : ఖర్చులు తగ్గించాలన్న ఉద్దేశంతో గత ఏడాది ట్విట్టర్ సంస్థ.. ఇండియాలో పనిచేస్తున్న 90 శాతం మంది ఉద్యోగులపై వేటు వేసిన విషయం తెలిసిందే. ఆ సంస్థ ఓనర్ ఎలన్ మస్క్ తీసుకున్న నిర్ణయం ప్రకారం ఆ చర్యలు తీసుకున్నారు. అయితే ఆ సోషల్ మీడియా సంస్థ ఇండియాలో ఉన్న మూడు ఆఫీసుల్లో రెండిటిని మూసివేసినట్లు కూడా ఓ నివేదిక ద్వారా వెల్లడైంది. ఢిల్లీ, ముంబైలలో ఉన్న ఆఫీసుల్ని మూసివేసినట్లు తెలిసింది. ఇండియాలో 200 మంది ట్విట్టర్‌లో పనిచేస్తున్నారు. దాంట్లో 90 శాతం మందిని తొలగిస్తూ గత ఏడాది ఆదేశాలు జారీ చేశారు.కేవలం బెంగుళూరులో ఉన్న ఆఫీసు నుంచి మాత్రమే ట్విట్టర్ తన కార్యకలాపాల్ని కొనసాగిస్తోంది. అక్కడ ఎక్కువ శాతం మంది ఇంజినీర్లు ఉన్నట్లు తెలుస్తోంది.
Also Read : శివలింగంపై రామబాణం గుర్తున్న అరుదైన ఆలయం..
ఇండియాలో ట్విట్టర్ వినియోగదారులు ఎక్కువగానే ఉన్నా.. ఆదాయం మాత్రం తక్కువగా ఉన్నట్లు రిపోర్ట్‌లో తేలింది. దీంతో ఇండియాలో ఉన్న రెండు ఆఫీసుల్ని మూసివేసేందుకు మస్క్ నిర్ణయించినట్లు తెలుస్తోంది. కాంటెంట్ అంశంలోనూ నియంత్రణలు ఎక్కువగా ఉన్నాయన్న ఆరోపణలు కూడా వస్తున్నాయి. అయితే కంపెనీని ఆర్ధికంగా బలోపేతం చేయడానికి ఈ ఏడాది చివరి వరకు సమయం పడుతుందని ఇటీవల మస్క్ వెల్లడించారు.
for telugu news live alerts like, follow and subscribe TMedia on Facebook । Twitter । YouTube