కోర్టు భవనాన్ని పరిశీలించిన సిఎల్పీ నేత భట్టి
టీ మీడియా, ఫిబ్రవరి 20,మధిర : స్థానిక పాత కోర్టు భవనాన్ని న్యాయ వాదులు తో కలిసి సోమవారం సి ఎల్ పి నేత మల్లు బట్టి విక్రమార్క పరిశీలించారు.అనంతరం మాట్లాడుతూ.పట్టణం చాలా చారిత్రాత్మకమైన పట్టణంహైద్రాబాద్ రాష్ట్ర స్వాతంత్య్రం కోసం పోరాటానికి చేయూత అందించిన ప్రాంతం మధిర నాడు హైదరాబాద్ రాష్ట్రం స్వాతంత్య్రం కోసం పోరాటం చేస్తున్న రోజుల్లో సర్దార్ జమలాపురం కేశవరావు గారి నాయకత్వంలో,హైద్రాబాద్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడుగా ఉన్న స్వామి రామానంద తీర్థ గారు నిజాం నవాబ్ రజాకార్ల తో పోరాటం చేస్తున్న సమయంలో గాయాలు,అయిన వారికి ఇక్కడ శిబిరాలు ఏర్పాటు చేసి వారికి అండగా ఉండి మరలా వారిని పోరాటానికి సన్నద్ధం చేసిన ప్రాంతం ఇది అన్నారు.
ఇలాంటి ప్రాంతం వేగంగా అభివృద్ధి చెందాలి అన్నదే నా కోరిక,నా ప్రయత్నంఅని పేర్కొన్నారు.ఇలాంటి ప్రాంతం వ్యవసాయ ఆధారిత ప్రాంతం దానికి తోడుగా విద్య,పారిశ్రామికంగాv కూడా అభివృద్ధి చెందితే మధిర ప్రాంతానికి తిరుగుండదు .విద్య అభివృద్ధి లో భాగంగా మనం వ్యవసాయ పాలిటెక్నిక్ కళాశాల,రెగ్యులర్ పాలిటెక్నిక్ కళాశాల ఏర్పాటు చేసుకోవడం జరిగింది అన్నారు.అలాగే జే ఎన్ టి యి లాంటి కలశాల కూడా ఒకటి కావాలని కోరడం జరిగింది..అందుకు నా ప్రయత్నం చేస్తా…. గతంలో అనేక రెసిడెన్షియల్ పాఠశాలలు ఏర్పాటు చేసుకున్నాం, అలాగే కస్తూరిబా లాంటి రెసిడెన్షియల్ పాఠశాలలు కూడా ఏర్పాటు చేసుకున్నాం వాటికి అనుబంధంగా రెసిడెన్షియల్ డిగ్రీ కళాశాల ఏర్పాటు చేయాలి.మారుతున్న పారిశ్రామిక,ఆధునిక అవసరాలకు అనుగుణంగా సైన్స్ అండ్ టెక్నాలజీ విభాగాలతో ఆ డిగ్రీ కలశాల ఉండాలి అని ప్రయత్నం చేస్తున్నా ను.
Also Read : కుట్టు మెషీన్ లు పంపిణి చేసిన మంత్రి పువ్వాడ
అలాగే ఇండస్ట్రియల్ పార్క్ పెట్టాలని కూడా ప్రయత్నం ఉన్నది. మొదట నుండి చెప్పేది మధిర పట్టణానికి అండర్ గ్రౌండ్ డ్రైనేజ్ సిస్టమ్ అవసరం తద్వారాపట్టణంపరిశుభ్రంగా,దోమలబెడద,పందుల బెడద లేకుండా ఉంటుంది.దానికోసం మొన్న అసెంబ్లీలోమాట్లాడాను,అందుకు కృషి చేస్తాను.మధిర లో ప్రవేశించడానికి అలాగే బయటకు వెళ్ళడానికి ఒక్కటే రహదారి ఉన్నది.అందువలనే మధిర విస్తరణ కూడా వేగవంతంగా జరగడంలేదు అందుకు అనుగుణంగా సమాంతరంగా రహదారులు అభివృద్ధి చేయాలి.తగు ప్రణాళికల అందుకు సిద్ధంగా ఉన్నాయి.ఇందిరా డైరీ ఏర్పాటు కూడా అవసరం వ్యవసాయ ఆధారిత పరిశ్రమ కు సంబంధించి ఇందిరా డైరీ లో అందర్నీ భాగస్వాములు చేసి ఇది ఏర్పాటు చేయాలని ఆలోచనా అందుకు కూడా నా ప్రయత్నం చేస్తా ము అన్నారు.
for telugu news live alerts like, follow and subscribe TMedia on Facebook । Twitter । YouTube