సిఎల్పీ తరపున సీఎం ను కలుద్దాం..

సిఎల్పీ తరపున సీఎం ను కలుద్దాం..

0
TMedia (Telugu News) :

 

జగ్గారెడ్డి ప్రగతి భవన్ దీక్ష కు బదులు సీఎల్పీ పోరాటం.

17న మిర్చి పంట నష్టాలపై సీఎల్పీ పర్యటన..

డిజిటల్ మెంబెర్షిప్ పై సీరియస్…

పోలీసులతో ఊడిగం చేయించుకుంటున్న టిఆర్ఎస్…

పార్లమెంట్ సమావేశాలలో చర్చించే అంశాలపై త్వరలో సీఎల్పీ సమావేశం..

జూమ్ మీటింగ్ లో పీసీసీ నిర్ణయం.. పాల్గొన్న పీసీసీ అధ్యక్షులు రేవంత్, సీఎల్పీ నేత భట్టి, వర్కింగ్ ప్రసిడెంట్స్, చైర్మన్ లు, ఏఐసీసీ కార్యదర్శులు.

 

ALSO read:కర్షకా ఆనందం.. రైతు బంధు సంబురాలు

ఈ నెల 17వ తేదీన సంగారెడ్డి ఎమ్మెల్యే జగ్గారెడ్డి ప్రగతి భవన్ వద్ద చేయాలనుకున్న దీక్ష స్థానంలో సీఎల్పీ ఉమ్మడి పోరాటం చేయాలని నిర్ణయం తీసుకుంది. 17వ తేదీన జగ్గారెడ్డి పలు అంశాలపై చేయాలనుకున్న దీక్ష ను వాయిదా వేసుకోవాలని, ఆ స్థానంలో సీఎల్పీ లోని ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీ లు సిఎం కేసీఆర్ కు లేఖ రాయాలని సిఎం అపాయింట్ మెంట్ అడగాలని, ఆయన కలిసేందుకు సమయం ఇవ్వకపోతే ఉమ్మడిగా పోరాటం చేయాలని సమావేశం నిర్ణయించింది. శనివారం నాడు జూమ్ లో జరిగిన సమావేశంలో టీపీసీసీ అధ్యక్షులు రేవంత్ రెడ్డి, సీఎల్పీ నేత భట్టి విక్రమార్క, ఏఐసీసీ కార్యదర్శులు బోసురాజు, శ్రీనివాస్ కృష్ణన్, వర్కింగ్ ప్రసిడెంట్స్ గీతారెడ్డి, జగ్గారెడ్డి, అంజన్ కుమార్ యాదవ్, ప్రచార కమిటీ చైర్మన్ మధు యాష్కీ, ఏఐసీసీ కార్యక్రమాల చైర్మన్ మహేశ్వర్ రెడ్డి తదితరులు పాల్గొన్నారు. సమావేశం అనంతరం వర్కింగ్ ప్రసిడెంట్ మహేష్ కుమార్ గౌడ్ సమావేశ వివరాలు ప్రకటించారు.

ప్రధానంగా డిజిటల్ మెంబెర్షిప్ బు సకాలంలో లక్షాన్ని సాధించే విదంగా పూర్తి చేయాలని నిర్ణయించారు. ఇకపోతే 17న ఎమ్మెల్యే జగ్గారెడ్డి పలు అంశాలపై సీఎం అపాయింట్ మెంట్ అడిగారని ఇవ్వని పక్షంలో అక్కడే దీక్ష చేస్తానని ప్రకటించారని అయితే ఆ కార్యక్రమాన్ని సిఎల్పీ తరపున అందరం కలిసి చేద్దామని టీపీసీసీ అధ్యక్షులు, సీఎల్పీ నేతలు చెప్పడంతో ఆయన అంగీకరించారని తెలిపారు. 18,19 తేదీలలో సిఎం ను కలిసి పలు అంశాలపై వినతి పత్రం ఇస్తామని లేనిపక్షంలో పోరాటం చేస్తామని అన్నారు. అలాగే 17వ తేదీన వెంకటాపురం మండలంలో మిర్చి రైతుల పరిస్థితి వడగళ్ల వర్షాలకు దెబ్బతిన్న అంశాలపై సీఎల్పీ నేతృత్వంలో ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీ కలిసి పర్యటించి రైతుల సమస్యలపై పోరాటం చేస్తామని పేర్కొన్నారు.

అలాగే రాష్ట్రంలో పోలీసులు శాంతి భద్రతలు పూర్తిగా విస్మరించి టిఆర్ఎస్ కార్యకర్తలుగా పని చేస్తున్నారని, ప్రజలకు సేవ చేయాల్సిన పోలీసులను టిఆర్ఎస్ నాయకులు ఊడిగం చేయించుకుంటున్నారని విమర్శించారు. పాల్వంచలో ఎమ్మెల్యే కొడుకు దారుణాల వల్ల ఒక కుటుంబం బలైనా, మంథని లో ఒక న్యాయవాడుల జంట ను దారుణంగా హత్య చేసిన పోలీసులు సరైన చర్యలు తీసుకోలేదని ఇలాంటి చాలా జరుగుతున్న ప్రజలకు భద్రత లేకుండా పోయిందని అన్నారు. పోలీసులు ప్రజలకు భద్రత కలిగించేలా ప్రభుత్వం చర్యలు తీసుకునేలా పోరాటం చేస్తామని అన్నారు.

అలాగే 20 నుంచి 24వ తేదీలలో సీఎల్పీ సమావేశం ఏర్పాటు చేసి ఎంపీలు, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీ లతోపాటు మాజీ మంత్రులు, పలువురు నిపుణుల తో సమావేశం ఏర్పాటు చేస్తామని రాబోయే పార్లమెంట్ బడ్జెట్ సమావేశాలలో మాట్లాడాల్సిన అంశాలపైనా, 317 జిఓ, విభజన చట్టం అంశాలపై చర్చిస్తామని వివరించారు.

advt
advt
for telugu news live alerts like, follow and subscribe TMedia on FacebookTwitterYouTube