వినాయ‌క చ‌వితి శుభాకాంక్ష‌లు తెలిపిన సీఎం కేసీఆర్

వినాయ‌క చ‌వితి శుభాకాంక్ష‌లు తెలిపిన సీఎం కేసీఆర్

0
TMedia (Telugu News) :

వినాయ‌క చ‌వితి శుభాకాంక్ష‌లు తెలిపిన సీఎం కేసీఆర్

టీ మీడియా, ఆగస్టు 30, హైద‌రాబాద్ : వినాయక చవితి పండుగ సందర్భంగా ముఖ్యమంత్రి కేసీఆర్ రాష్ట్ర ప్రజలకు శుభాకాంక్షలు తెలిపారు. సకల శాస్త్రాలకు అధిపతిగా, బుద్ధికి, జ్ఞానానికి ఆరాధ్యుడిగా, ఆటంకాలను తొలగించే విఘ్నేశ్వరుడిగా, భక్తి శ్రద్ధలతో హిందువులు గణనాథున్ని ఆరాధిస్తారని సీఎం కేసీఆర్ అన్నారు. జ్ఞానం, లక్ష్య సాధన, నైతిక విలువలు, ప్రకృతి పరిరక్షణ వంటి సుగుణాలను వినాయక చవితి పండుగ మనకు నేర్పుతుందని కేసీఆర్ పేర్కొన్నారు.

Also Read : ఈ దొంగలు మామూలోళ్లు కాదు

గణపతి నవరాత్రి ఉత్సవాలను ప్రజలంతా శాంతి సౌభ్రాతృత్వాలు వెల్లివిరిసేలా, ఆనందంతో జరుపుకోవాలని ఆకాంక్షించారు. ఎవరెన్ని ఆటంకాలు సృష్టించినా వాటిని వినాయకుని దీవెనలతో అధిగమిస్తూ, సకల జన సంక్షేమమే లక్ష్యంగా, రాష్ట్ర ప్రభుత్వం అభివృద్ది సంక్షేమ కార్యక్రమాలను అమలు చేస్తున్నదని సీఎం స్ప‌ష్టం చేశారు. తలపెట్టిన కార్యాలు నిర్విఘ్నంగా కొనసాగేలా, సుఖ శాంతులతో జీవించేలా, దేశ ప్రజలందరికీ ఆ ఏకదంతుని దీవెనలు అందాలని సీఎం కేసీఆర్ ప్రార్థించారు.

for telugu news live alerts like, follow and subscribe TMedia on FacebookTwitterYouTube