సీఎం కప్ సెలక్షన్ పోటీలు ప్రారంభం

0
TMedia (Telugu News) :

టీ మీడియా, నవంబర్ 24, మహానంది:

మహానంది మండల కేంద్రమైన యం. తిమ్మాపురం జిల్లా పరిషత్ పాఠశాల ఆవరణలో సీఎం కప్ సెలెక్షన్స్ కార్యక్రమాన్ని మహానంది మండల అధ్యక్షురాలు బుడ్డారెడ్డి యశస్విని ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ మండల స్థాయిలో ప్రతిభ ఉన్న క్రీడాకారులను వెలికితీసి వారికి మంచి భవిష్యత్తు అందించడమే సీఎం జగన్ లక్ష్యం అని అన్నారు.

విద్యార్థులకు క్రీడల్లో రాణించడం ద్వారా ఉజ్వల భవిష్యత్తు ఉంటుందని, చదువుతో పాటు క్రీడల్లో రాణించాలని ఆమె కోరారు. అనంతరం ఎంపిపి యశస్విని రెడ్డి, జెట్పిటిసి మహేశ్వరరెడ్డి, క్రీడాకారులతో కబడ్డీ ఆడుతూ వారిలో ఉత్సాహాన్ని నింపారు.
ఈ కార్యక్రమంలోమహానంది ఎస్ఐ సిసి నాగార్జునరెడ్డి, జడ్పీటీసీ కేవీఆర్ మహేశ్వరరెడ్డి, వైయస్సార్ సిపి నాయకులు కార్యకర్తలు, తదితరులు పాల్గొన్నారు.

for telugu news live alerts like, follow and subscribe TMedia on FacebookTwitterYouTube