సీఎం జగన్ హెలికాప్టర్‌లో సాంకేతిక లోపం
టీ మీడియా, ఏప్రిల్ 26, అమరావతి : ఏపీ సీఎం జగన్ ప్రయాణిస్తున్న హెలికాప్టర్ సాంకేతిక సమస్యతో నిలిచిపోయింది. అనంతపురం జిల్లాలో పర్యటిస్తున్న జగన్ అక్కడి నుంచి బుధవారం పుట్టపర్తికి వెళ్లాలి. అనంతపురంలో ఏర్పాటుచేసిన అధికారిక కార్యక్రమం పూర్తికావడంతో పుట్టపర్తికి బయలుదేరే సమయంలో హెలికాప్టర్‌లో సాంకేతిక సమస్య తలెత్తింది. దీంతో ఆయన ప్రయాణం రోడ్డు మార్గాన సాగింది. అనంతపురం జిల్లా శింగనమల నియోజకవర్గం నార్పలలో ఏపీ సీఎం బుధవారం పర్యటించారు. అక్కడ ఏర్పాటు చేసిన బహిరంగ సభలో పాల్గొని పుట్టపర్తికి బయలు దేరే సమయంలో సమస్య ఏర్పడింది. జగన్ రోడ్డు మార్గాన బయలు దేరడంతో వెంటనే పోలీసులు, జిల్లా అధికారులు రోడ్డు మార్గాల్లో ఉన్న గ్రామాల వద్ద బందోబస్తు ఏర్పాట్లు చేశారు.
AlsoRead:వరి ధాన్య కొనుగోలు కేంద్రాన్ని ప్రారంభించిన నాబార్డ్ ఎఫ్.పి.ఓ
for telugu news live alerts like, follow and subscribe TMedia on Facebook । Twitter । YouTube