హోంమంత్రి అమిత్‌షాతో సీఎం జగన్‌ భేటీ

హోంమంత్రి అమిత్‌షాతో సీఎం జగన్‌ భేటీ

2
TMedia (Telugu News) :

హోంమంత్రి అమిత్‌షాతో సీఎం జగన్‌ భేటీ
టీ మీడియా, ఏప్రిల్ 6,ఢిల్లీ: కేంద్ర హోంమంత్రి అమిత్‌షాతో ఆంధ్రప్రదేశ్‌ ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి భేటీ అయ్యారు. రాష్ట్రానికి సంబంధించిన కీలక అంశాలపై చర్చించారు. సీఎం జగన్‌ మంగళవారం తన ఢిల్లీ పర్యటనలో భాగంగా తొలుత ప్రధాని నరేంద్ర మోదీతో భేటీ అయ్యారు. ప్రధానితో గంటకు పైగా సాగిన సమావేశంలో రాష్ట్రానికి సంబంధించి పలు కీలక అంశాలపై చర్చించారు.పోలవరం ప్రాజెక్టు, కడప స్టీల్‌ ప్లాంట్, జాతీయ ఆహార భద్రతా చట్టం అర్హుల ఎంపికలో హేతుబద్ధత, తెలంగాణ డిస్కంల నుంచి రాష్ట్రానికి బకాయిలు తదితర అంశాలను ప్రధానికి సీఎం నివేదించారు. ముఖ్యమంత్రి నివేదించిన అంశాల పట్ల ప్రధాని సానుకూలంగా స్పందించారు. అనంతరం కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్‌తో సీఎం భేటీ అయ్యారు. రాష్ట్రానికి సంబంధించిన కీలక అంశాలపై చర్చించారు.

Also Read : 7న మహాధర్నా ను జయప్రదం చేయండి

for telugu news live alerts like, follow and subscribe TMedia on FacebookTwitterYouTube