మత్స్యకార కుటుంబాలకు నిధులు విడుదల చేసిన సిఎం జగన్
మత్స్యకార కుటుంబాలకు నిధులు విడుదల చేసిన సిఎం జగన్
మత్స్యకార కుటుంబాలకు నిధులు విడుదల చేసిన సిఎం జగన్
టీ మీడియా, నవంబర్ 21, అమరావతి : ఓఎన్జీసీ పైపులైన్ ద్వారా జీవనోపాధి కోల్పోయిన మత్స్యకారులకు ముఖ్యమంత్రి వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి నిధులను విడుదల చేశారు. డాక్టర్ బి.ఆర్.అంబేద్కర్ కోనసీమ, కాకినాడ జిల్లాల్లోని 23,458 కుటుంబాలకు రూ.161.86 కోట్లను సిఎం విడుదల చేశారు. మంగళవారం ఉదయం తాడేపల్లి క్యాంపు కార్యాలయం నుంచి వర్చువల్ పద్ధతిలో ముఖ్యమంత్రి ఈ కార్యక్రమంలో పాల్గన్నారు. పైపులైను ద్వారా జీవనోపాధి కోల్పోయిన మత్స్యకారులకు నెలకు రూ.11,500 చొప్పున 6 నెలలకుగానూ రూ.69,000 చొప్పున మొత్తంగా రూ.161.86 కోట్లను సీఎం బటన్ నొక్కి వారి ఖాతాల్లో జమ చేశారు. నిర్ణయించిన షెడ్యూల్ ప్రకారం … సిఎం ఈరోజు తిరుపతి జిల్లా మాంబట్టు వద్ద మత్స్యకారులకు మేలు చేసే పలు అభివృద్ధి కార్యక్రమాల్లో పాల్గనాల్సి ఉంది. తిరుపతిజిల్లా వాకుడు మండలం రాయదరువు వద్ద ఫిష్ ల్యాండింగ్ సెంటర్‌కు, పులికాట్ సరస్సు ముఖద్వారం పునరుద్ధరణ పనుల సహా మరికొన్ని పనులను సిఎం ప్రారంభించాల్సి ఉంది. అయితే భారీ వర్షాల కారణంగా ముఖ్యమంత్రి తన పర్యటనను వాయిదా వేసుకున్నారు.
for telugu news live alerts like, follow and subscribe TMedia on Facebook । Twitter । YouTube