వైఎస్‌ఆర్‌ జగనన్న ఇళ్ల కాలనీని ప్రారంభించిన సీఎం జగన్‌

-చంద్రబాబు,పవన్‌పై మండిపాటు

0
TMedia (Telugu News) :

వైఎస్‌ఆర్‌ జగనన్న ఇళ్ల కాలనీని ప్రారంభించిన సీఎం జగన్‌

-చంద్రబాబు,పవన్‌పై మండిపాటు

టీ మీడియా, అక్టోబర్ 12, కాకినాడ : జిల్లాలోని సామర్లకోటలో వైఎస్‌ఆర్‌ జగనన్న కాలనీల్లో లబ్దిదారులకు ఇళ్లను సీఎం జగన్‌ అందించారు. నవరత్నాలు పేదలందరికీ ఇళ్ల నిర్మాణం కార్యక్రమంలో భాగంగా సామర్లకోటలో నిర్మించిన ఇళ్లను సీఎం జగన్‌ లబ్దిదారులకు గురువారం లబ్దిదారులతో గహా ప్రవేశం చేయించారు. సామర్లకోటలో లబ్దిదారులతో సామూహిక గహ ప్రవేశాల కార్యక్రమంలో సీఎం జగన్‌ పాల్గొన్నారు. ఈ సందర్భంగా నిర్వహించిన సభలో సీఎం జగన్‌ ప్రసంగించారు. దేశంలో ఎక్కడా లేని విధంగా ఆంధ్ర ప్రదేశ్‌లో 31 లక్షల కుటుంబాలకు ఇళ్ల పట్టాలు ఇచ్చామన్నారు. 22 లక్షల ఇళ్ల నిర్మాణం జరుగుతుందన్నారు. రాష్ట్ర వ్యాప్తంగా 17 వేల వైఎస్‌ఆర్‌ జగనన్న కాలనీలు వస్తున్నాయన్నారు. వేల కోట్లు ఖర్చు పెట్టి ఇంటి కలను సాకారం చేస్తున్నామన్నారు.ఈ సందర్భంగా చంద్రబాబు, పవన్‌ కళ్యాణ్‌ సీఎం జగన్‌ విమర్శలు చేశారు. ఒకసారి లోకల్‌, మరోసారి నేషనల్‌, ఇంకోసారి ఇంటర్నేషనల్‌ అంటూ పవన్‌ కళ్యాణ్‌ భార్యల గురించి వ్యాఖ్యలు చేశారు.

Also Read : తెలంగాణలో హాట్ సీట్

ఇది దత్తపుత్రుడికి మహిళలపై ఉన్న గౌరవమని సీఎం పవన్‌ కళ్యాణ్‌ పై విమర్శలు గుప్పించారు.వివాహ వ్యవస్థపై పవన్‌ కళ్యాణ్‌ గౌరవం లేదన్నారు. ప్యాకేజీ స్టార్‌కు గాజువాక, భీమవరంతో సంబంధం లేదని పవన్‌ కళ్యాణ్‌ పై విమర్శలు చేశారు సీఎం జగన్‌. చంద్రబాబు ముఖం చూస్తే స్కాంలు, అవినీతి, జన్మభూమి కమిటీలు గుర్తుకు వస్తాయన్నారు. 14 ఏళ్ల పాటు సీఎంగా పనిచేసిన చంద్రబాబు పేదలకు ఇళ్లు ఎందుకు ఇవ్వలేకపోయారని ఆయన ప్రశ్నించారు. ఈ 52 నెలల కాలంలో చంద్రబాబు నాయుడు ఒక నెల పాటు కంటిన్యూగా రాష్ట్రంలో కన్పించాడా అని సీఎం జగన్‌ ప్రశ్నించారు. కానీ ఇప్పుడు రాజమండ్రిలో కన్పిస్తున్నాడని సెటైర్లు వేశారు. చంద్రబాబుకు,దత్తపుత్రుడికి, చంద్రబాబు తనయుడికి, చంద్రబాబు బావమరిదికి ఏపీలో ఇళ్లు లేదన్నారు. ఆంధ్రరాష్ట్రాన్ని దోచుకోవడానికి దోచుకున్నది పంచుకోవడానికి హైద్రాబాద్‌ లో పంచుకోవడమే చంద్రబాబుకు,చంద్రబాబును సమర్ధించే వాళ్లకు ఏపీలో ఇళ్లు లేవన్నారు. చంద్రబాబు ఇళ్లు పక్క రాష్ట్రంలోని హైద్రాబాద్‌ లో కన్పిస్తుందన్నారు. రాష్ట్ర ప్రజల పట్ల బాబుకు ఉన్న అనుబంధం ఇదే అని జగన్‌ చెప్పారు.

Also Read : కోర్టు అనుమ‌తితో శిశువును చంపాల‌నుకుంటున్నారా

తాను ప్రాతినిథ్యం వహిస్తున్న కుప్పంలో కూడ పేదలకు ఇళ్ల పట్టాలు, ఇళ్ల నిర్మాణం చంద్రబాబు చేయలేదని ఆయన విమర్శించారు. కానీ తమ ప్రభుత్వ హయంలోనే కుప్పంలో ఇళ్ల పట్టాలు, ఇళ్ల నిర్మాణాలు చేసినట్టుగా జగన్‌ గుర్తు చేశారు. పేదలకు ఇళ్ల స్థలాలిస్తే కులాల మధ్య సమతుల్యం దెబ్బతింటుందని కోర్టుకు వెళ్తారని చంద్రబాబుపై జగన్‌ మండిపడ్డారు.ప్రభుత్వం ఎంత మంచి చేసినా మంటలు పెట్టి కుట్రలు చేస్తున్నారన్నారు.నా ఎస్సీలు, నా ఎస్టీలు, నా బీసీలు కూడ అనలేరని బాబు తీరుపై విమర్శలు చేశారు.కష్టమొచ్చినా, నష్టమొచ్చినా నిలబడే వాడే నాయకుడన్నారు.రాష్ట్రంలోని 87 శాతం ఇళ్లకు సంక్షేమ పథకాలను అందిస్తున్నామని జగన్‌ చెప్పారు.

for telugu news live alerts like, follow and subscribe TMedia on FacebookTwitterYouTube