నూతన పరకామణి భవనాన్ని ప్రారంభించిన సీఎం జగన్‌

- టీటీడీ డైరీలు, క్యాలెండర్ల ఆవిష్కరణ

1
TMedia (Telugu News) :

నూతన పరకామణి భవనాన్ని ప్రారంభించిన సీఎం జగన్‌

– టీటీడీ డైరీలు, క్యాలెండర్ల ఆవిష్కరణ

టీ మీడియా, సెప్టెంబర్‌ 28, తిరుమల: తిరుమల శ్రీ వేంకటేశ్వర స్వామివారిని ఏపీ సీఎం జగన్‌ దర్శించుకున్నారు. స్వామివారికి ముఖ్యమంత్రి ప్రత్యేక పూజలు చేశారు. అనంతరం రంగనాయకుల మండపంలో అర్చకులు సీఎం జగన్‌కు వేదాశీర్వచనం అందించారు. తర్వాత నూతనంగా నిర్మించిన పరకామణి భవనాన్ని, అతిథి గృహాన్ని ప్రారంభించారు. అంతకుముందు బ్రహ్మోత్సవాల్లో భాగంగా నిర్వహించిన పెద్దశేషవాహన సేవలో పాల్గొన్నారు.బ్రహ్మోత్సవాలను పురస్కరించుకుని రాష్ట్ర ప్రభుత్వం తరఫున సీఎం జగన్‌ శ్రీవారికి పట్టువస్త్రాలు సమర్పించారు.

Also Read : యాదాద్రీశుని సేవలో హైకోర్టు న్యాయమూర్తి

ప్రతిఏటా నిర్వహించే శ్రీవారి బ్రహ్మోత్సవాలకు రాష్ట్ర ప్రభుత్వం తరఫున స్వామివారికి పట్టువస్త్రాలు సమర్పించడం ఆనవాయితీ. అందులో భాగంగా ధ్వజారోహణతో మంగళవారం ప్రారంభమైన బ్రహ్మోత్సవాల తొలి రోజున ఆయన శ్రీవారికి పట్టువస్త్రాలను తీసుకొచ్చారు. శ్రీవారి సాల‌క‌ట్ల బ్రహ్మోత్సవాలలో భాగంగా తిరుమలకు వచ్చిన ఏపీ ముఖ్యమంత్రి వైఎస్‌. జ‌గ‌న్‌మోహ‌న్‌రెడ్డి టీటీడీ ముద్రించిన 2023వ సంవత్సరం డైరీలు, క్యాలెండర్లను ఆవిష్కరించారు.

Also Read : ల‌తా మంగేష్క‌ర్‌కు నివాళిగా 40 ఫీట్ల వీణ విగ్ర‌హం ఏర్పాటు

12 పేజీల క్యాలెండర్లు 13 లక్షలు, 6 పేజీల క్యాలెండ‌ర్లు 50 వేలు, పెద్ద డైరీలు 8 లక్షలు, చిన్నడైరీలు 1.50 లక్షలు, టేబుల్‌ టాప్‌ క్యాలెండర్లు 2.50 ల‌క్షలు ముద్రించినట్లు టీటీడీ అధికారులు వెల్లడించారు. శ్రీవారి పెద్ద క్యాలెండర్లు 3.5 లక్షలు, శ్రీ పద్మావతి అమ్మవారి పెద్ద క్యాలెండర్లు 10 వేలు, శ్రీవారు, శ్రీపద్మావతి అమ్మవారి క్యాలెండర్లు 4 లక్షలు, తెలుగు పంచాంగం క్యాలెండర్లు 2.50 లక్షల కాపీలను టీటీడీ ముద్రించిం ది. క్యాలెండ‌ర్లు, డైరీలు తిరుమల, తిరుపతిలోని టీటీడీ పుస్తక విక్రయశాలల్లో అందుబాటులో ఉన్నాయని తెలిపారు. ఇత‌ర ప్రాంతాల్లోని టీటీడీ స‌మాచార కేంద్రాల్లో త్వరలో అందుబాటులో ఉంచుతామని ప్రకటించారు.

for telugu news live alerts like, follow and subscribe TMedia on FacebookTwitterYouTube