నిరుద్యోగులు ఆశాదీపం కేసీఆర్* గ్రంథాలయ సంస్థ చైర్మన్ దిండిగాల
టి మీడియా,మార్చి10,భద్రాద్రి కొత్తగూడెం : ముఖ్యమంత్రి కె చంద్రశేఖర రావు నిరుద్యోగుల పాలిట ఆశాదీపం అని, అసెంబ్లీ సాక్షిగా ఆయన చేసిన ఉద్యోగ ప్రకటన పలువురి జీవితాల్లో వెలుగులు నింప బోతోందని తెలంగాణ మలిదశ ఉద్యమ నేత, జిల్లా గ్రంథాలయ సంస్థ చైర్మన్ దిండిగాల రాజేందర్ అన్నారు.
Also Read : క్రీడాకారుడు కుటుంబానికి పరామర్శ
గురువారం భద్రాద్రి కొత్తగూడెం జిల్లా గ్రంథాలయ ఆవరణలో నిరుద్యోగ యువత హర్షం వ్యక్తం చేస్తూ సీఎం చిత్రపటానికి పాలాభిషేకం నిర్వహించి మిఠాయిలు పంచుకున్నారు. సందర్భంగా వారిని ఉద్దేశించి దిండిగాల మాట్లాడుతూ నిరుద్యోగుల ఆశలు చిగురించ ను న్నాయని, ఎక్కడలేని విధంగా తెలంగాణ ప్రభుత్వం 91, 142 ఉద్యోగాలను భర్తీ చేసేందుకు రంగం సిద్ధం చేసిందన్నారు. ప్రతిపక్షాలు కల్లబొల్లి మాటలు చెబుతూ యువతను తప్పుతోవ పటించే ప్రయత్నం చేశాయని, ఇలాంటి తరుణంలో యువత కూడా ఇబ్బందులకు లోనయ్యారనీ చెప్పారు. ప్రతి పక్షాల నోళ్ళు ఊహించే ఏ విధంగా తాము ప్రజల పక్ష పాతులం అంటూ ఉద్యోగాలు భర్తీ చేసేందుకు ప్రకటన చేశారని చెప్పారు. అంతేకాకుండా వయో పరిమితిని కూడా సడలిస్తూ సాహసోపేతమైన నిర్ణయాన్ని తీసుకున్నారన్నారు. పనిలేని ప్రతిపక్షాలు మాత్రం ఉద్యోగాల ప్రకటన అడ్డుకునేందుకు కుట్రలు పన్నుతున్నాయని, వారి ఎత్తులను చిత్తు చేసేందుకు సిద్ధంగా ఉండాలన్నారు. రాష్ట్ర ప్రభుత్వం అందిస్తున్న ఈ సదవకాశాన్ని యువతీయువకులు సద్వినియోగం చేసుకోవాలని, ఇందుకోసం గ్రంధాలయంలో కావలసిన పుస్తకాలతో పాటు స్టడీ మెటీరియల్ అందుబాటులో ఉండే విధంగా చర్యలు తీసుకుంటామని చెప్పారు. ఈ కార్యక్రమంలో గ్రంథ పాలకురాలు జి మణి మృథుల,సిబ్బంది యువతీయువకులతో పాటు పలువురు పాల్గొన్నారు.
for telugu news live alerts like, follow and subscribe TMedia on Facebook । Twitter । YouTube