రాష్ట్రాన్ని అన్నపూర్ణగా నిలిపింది కేసీఅర్

తెలంగాణ రైతులను ఎడిపిస్తున్న కేంద్రం

1
TMedia (Telugu News) :

 

రాష్ట్రాన్ని అన్నపూర్ణగా నిలిపింది కేసీఅర్
-తెలంగాణ రైతులను ఎడిపిస్తున్న కేంద్రం
– నిరసన దీక్షలో మంత్రి పువ్వాడ.
టీ మీడియా, ఏప్రిల్ 8,ఖమ్మం :కేసీఆర్ నాయకత్వంలో తెలంగాణ రైతు రాజు అయ్యి, రాష్ట్రం అన్నపూర్ణగా అవతరించడం తట్టుకోలేని బీజేపీ కేంద్ర ప్రభుత్వం కేసిఆర్ గారి మీద కక్ష సాధింపు కోసం ఇక్కడి రైతుల ధాన్యం కొనుగోలు చేయకుండా ఇబ్బంది పెడుతుందని, కేంద్రం తన తప్పు తెలుసుకుని తెలంగాణ రైతన్న పండించిన యాసంగి పంటను అంతా కొనేవరకు ఈ ఉద్యమం ఆగదని రాష్ట్ర రవాణా శాఖ మంత్రి పువ్వాడ అజయ్ కుమార్ హెచ్చరించారు.తెలంగాణలో రైతు ధాన్యం కొనుగోలులో బీజేపీ కేంద్ర ప్రభుత్వ మొండి వైఖరికి వ్యతిరేకంగా రాష్ట్ర టి.ఆర్.ఎస్ పార్టీ అధ్యక్షుడు కేసీఅర్ , వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ ఇచ్చిన పిలుపు మేరకు ఖమ్మం జిల్లా కేంద్రంలో కలెక్టరేట్ ఎదుట ధర్నాచౌక్ నందు చేపట్టిన నిరసన దీక్షలో మంత్రి పువ్వాడ అజయ్ కుమార్ గారు పాల్గొని, ప్రసంగించారు.రైతు ఏడ్చిన రాజ్యం, ఎద్దు ఏడ్చిన వ్యవసాయం బాగుపడదన్న విషయం గుర్తుంచుకోవాలని, రైతులను ఏడిపించి మీరు బాగుపడరని అన్నారు.

Also Read : టెన్త్ పరీక్షలకు మరో అరగంట: సబిత

మండుటెండలో మత్తడి తాకని చెరువులు నేడు పరవళ్ళు తొక్కుతున్నాయని అన్నారు. బిజేపి పాలిత రాష్ట్రాల్లో విద్యుత్ సంక్షభం, పవర్ హాలిడే లు ఉన్న తరుణంలో తెలంగాణ రాష్ట్రంలో ఉచిత విద్యుత్ ఇస్తు పంటలు విస్తారంగా పండిస్తున్నారనిన్నారు. . తెలంగాణలో మిషన్ భగీరథ పథకం అద్భుతంగా ఉందని మీ మంత్రి గజేంద్ర సింగ్ శికావత్ కొనియడటం, ముఖ్యమంత్రి కేసీఅర్ మొనగాడు ఆని ప్రకటించడంతోనే కేసీఅర్ గారి సమర్థత అర్దం అవుతుందన్నారు.గత రెండు సంవత్సరాలుగా తెలంగాణలో రైతుల నుండి ధన్యం కోనుగోలు చేసి వారిని ఆదుకున్నది తెలంగాణ ప్రభుత్వం కాదా అని ప్రశ్నించారు.ప్రతి గింజ కొంటామని చెప్పిన బండి సంజయ్, కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి ఇప్పుడు ఏం మాట్లాడలేక మొహం చాటేశారని అన్నారు.ఇదే విషయమై ఢిల్లీలో కేంద్ర మంత్రిని కలవడానికి వెళ్తే మంత్రులను హీనంగా చూస్తూ అవమానపరిచే విధంగా వ్యవహరించడం సిగ్గుచేటన్నారు. పైగా తెలంగాణ ప్రజలకు నూకలు అలవాటు చేయాలని ఉచిత సలహాలు ఇవ్వటం పట్ల ఆగ్రహం వ్యక్తం చేశారు.

Also Read : ఇల్లును కాలపెట్టిన ఎలుక :రూ. 2 లక్షల నగదు దహనం..

కేంద్ర బీజేపీ ప్రభుత్వం అనుసరిస్తున్న రైతు వ్యతిరేఖ విధానాల వల్లే నేడు మంత్రులుగా ఉన్నా నేడు రాష్ట్ర వ్యాప్తంగా అన్ని జిల్లా కేంద్రాల్లో నిరసన చేస్తున్నారని పేర్కొన్నారు.కేంద్ర ప్రభుత్వం మెడలు వంచే వరకు ఈ ఉద్యమం కొనసాగించాలని రైతు బిడ్డగా కోరుతున్నానని విజ్ఞప్తి చేశారు.బీజేపీ వ్యతిరేక దీక్ష మొదలైందని, ఓపిక ఉన్నంతవరకు, బీజేపీ కళ్ళు తెరిచే వరకు దీనిని కొనసాగిస్తామని, కేంద్రం దిగిరాకపోతే ఉద్యమం ఉదృతం అవుతుందని హెచ్చరించారు.రాజకీయంగా మనం ఏ స్థాయి నాయకుల అయినా ముందుగా రైతు బిడ్డలం. వ్యవసాయాన్ని ఆధారంగా చేసుకుని జీవిస్తున్నాం. రైతు సంతోషంగా ఉంటే, రెండు పంటలు పండిస్తే దేశమంతా అందరూ కడుపు నిండా అన్నం తింటారని వివరించారు.బిడ్డా మాకు తెలుసు మీ మెడలు వంచి, రైతు పండించిన పంట కొనిపించే బాధ్యత తెరాస తీసుకుంటుందని,అప్పటి వరకు ఈ ఉద్యమం కొనసాగుతుందని స్పష్టం చేశారు. దీనికి అందరు కలిసి రావాలని రెండు చేతులు జోడిస్తూ నమస్కరిస్తున్నానన్నారు.

for telugu news live alerts like, follow and subscribe TMedia on FacebookTwitterYouTube