గంగుల కమలాకర్‌ను పరామర్శించిన సీఎం కేసీఆర్
టీ మీడియా, జనవరి 16, కరీంనగర్ : బీసీ సంక్షేమ శాఖ మంత్రి గంగుల కమలాకర్‌ను ముఖ్యమంత్రి కె. చంద్ర శేఖర రావు పరామర్శించారు. గంగుల కమలాకర్ తండ్రి మల్లయ్య జనవరి 4వ తేదీన కన్నుమూశారు. సోమవారం కరీంనగర్‌లోని గంగుల నివాసంల ద్వాదశ దిన కర్మ కార్యక్రమం జరిగింది. దాంతో, సీఎం కేసీఆర్ హైదరాబాద్ నుండి కరీంనగర్ వెళ్లారు. గంగుల ఇంటికి వెళ్లి మల్లయ్య చిత్రపటానికి పూలమాల వేసి, నివాళులర్పించారు. అనంతరం మంత్రి కమలాకర్, అతని కుటుంబ సభ్యులను ఓదార్చారు. ఆ తర్వాత హెలిక్యాప్టర్‌లో హైదరాబాద్‌కు తిరుగు ప్రయాణమమ్యారు. గంగుల మల్లయ్య చనిపోయిన రోజు సీఎం కేసీఆర్, గంగులకు ఫోన్ చేసి మాట్లాడారు. సంతాపం తెలియజేసి, కమలాకర్‌ను ఓదార్చారు. ఈరోజు దశ దిన కర్మ కావడంతో సీఎం స్వయంగా వెళ్లి మంత్రిని పరామర్శించారు. గంగుల కమలాకర్‌ను పరామర్శించిన వాళ్లలో మంత్రులు కొప్పుల ఈశ్వర్, వేముల ప్రశాంత్ రెడ్డి ఉన్నారు.
Also Read : మధ్యతరగతిపై నిర్మలా సీతారామన్ కీలక వ్యాఖ్యలు
రాష్ట్ర ప్రణాళికా సంఘం ఉపాధ్యక్షుడు బోయినపల్లి వినోద్ కుమార్, రాజ్యసభ సభ్యులు దీవకొండ దామోదర్ రావు , జోగినపల్లి సంతోష్ కుమార్ , ఎమ్మెల్సీ ఎల్ రమణ , ఎమ్మెల్యేలు దాసరి మనోహర్ రెడ్డి, వొడితెల సతీష్ బాబు, రసమయి బాలకిషన్, సంజయ్ కుమార్, సుంకే రవి శంకర్ , కోరుకంటి చందర్‌లు గంగుల తండ్రి మల్లయ్యకు నివాళులర్పించారు.
for telugu news live alerts like, follow and subscribe TMedia on Facebook । Twitter । YouTube