హైదరాబాద్‌కు చేరుకున్న సీఎం కేసీఆర్

అర్ధాంతరంగా ముగిసిన దేశవ్యాప్త పర్యటన

1
TMedia (Telugu News) :

హైదరాబాద్‌కు చేరుకున్న సీఎం కేసీఆర్
– అర్ధాంతరంగా ముగిసిన దేశవ్యాప్త పర్యటన

టిమీడియా,మే24,హైదరాబాద్:
జాతీయ స్థాయిలో ప్రత్యామ్నాయ ఎజెండా రూపొందించడమే లక్ష్యంగా దేశవ్యాప్త పర్యటన చేపట్టిన ముఖ్యమంత్రి కేసీఆర్.. పర్యటన మధ్యలోనే హైదరాబాద్‌కు తిరిగొచ్చారు. ఈ నెల 27 వరకు కొనసాగాల్సిన పర్యటనను మధ్యలోనే ముగించుకొని అనూహ్యంగా ఆయన సోమవారం రాత్రే హైదరాబాద్‌కు చేరుకున్నారు.
దేశవ్యాప్త పర్యటన మధ్యలోనే హైదరాబాద్‌కు సీఎంఈ నెల 27 వరకు కొనసాగాల్సిన పర్యటనసోమవారం రాత్రే హైదరాబాద్‌కు చేరుకున్న వైనందేశవ్యాప్త పర్యటన చేపట్టిన టీఆర్ఎస్ చీఫ్, తెలంగాణ సీఎం కేసీఆర్ అర్ధాంతరంగా హైదరాబాద్ తిరిగొచ్చేశారు. జాతీయ స్థాయిలో ప్రత్యామ్నాయ ఎజెండా రూపొందించడమే లక్ష్యంగా, జాతీయ రాజకీయాల్లో కీలక భూమిక పోషించడమే ధ్యేయంగా ఆయన ఈ పర్యటన మొదలుపెట్టారు. ఈ నెల 27 వరకు కొనసాగాల్సిన పర్యటనను మధ్యలోనే ముగించుకొని అనూహ్యంగా ఆయన సోమవారం రాత్రే హైదరాబాద్‌కు చేరుకున్నారు.

Also Read : అవినీతి ఆరోపణలు

ముఖ్యమంత్రి ఈనెల 20న ఢిల్లీకి వెళ్లిన సందర్భంలో సీఎంవో చేసిన ప్రకటన ప్రకారం గత నాలుగు రోజుల షెడ్యూల్ సాగగా.. 24, 25 తేదీల్లో పలువురు ప్రముఖులతో చర్చలు, భేటీలు జరగాల్సి ఉన్నా.. సీఎం వాటిని వాయిదా వేసుకొని హైదరాబాద్‌కు వచ్చారు. ముందుగా పేర్కొన్న మేరకు ఈ నెల 26న బెంగళూరుకు, 27న రాలెగావ్‌ సిద్దికి కేసీఆర్ వెళ్లాల్సి ఉంది. బెంగళూరులో జేడీఎస్‌ నేత, మాజీ ప్రధాని దేవెగౌడ, కర్ణాటక మాజీ సీఎం కుమారస్వామితో కేసీఆర్‌ భేటీ కావాల్సి ఉంది. అక్కడి నుంచి 27న రాలెగావ్‌ సిద్ది పర్యటనకు వెళ్లి.. సామాజిక ఉద్యమకారుడు అన్నా హజారేతో భేటీ అయి, షిర్డీకి వెళ్లి దర్శనం చేసుకొని ఆ తర్వాత హైదరాబాద్ తిరిగొస్తారని సీఎంవో తెలిపింది. ఒకరోజు వ్యవధిలోనే మళ్లీ షెడ్యూల్ ప్రకారం కేసీఆర్ ఈనెల 27న హైదరాబాద్ తిరిగొచ్చి, మళ్లీ ఒక రోజు వ్యవధిలోనే అంటే.. 29, 30 తేదీల్లో బెంగాల్‌, బిహార్‌ పర్యటనకు వెళ్లి మమతా బెనర్జీ, తేజస్వియాదవ్‌ తదితరులను కలుసుకోవాల్సి ఉంది.

Also Read : హైదరాబాద్‌లో ప్రధాని మోడీ టూర్

అయితే కేసీఆర్ సడన్‌గా తన దేశవ్యాప్త పర్యటనకు విరామం ఇచ్చి రాష్ట్రానికి రావడం ఇప్పుడు చర్చనీయాంశమైంది. ప్రధాని నరేంద్ర మోదీ ఈనెల 26న హైదరాబాద్ వస్తున్నారు కాబట్టే సీఎం కేసీఆర్ దేశవ్యాప్త పర్యటన అంటూ పారిపోయారని బీజేపీ నేతలు ఎద్దేవా చేస్తుండటం తెలిసిందే. అయితే.. దేశవ్యాప్త పర్యటన నుంచి కేసీఆర్ హఠాత్తుగా హైదరాబాద్ రావడానికి బలమైన కారణాలున్నట్లు తెలుస్తోంది. తెలంగాణకు అప్పుల వ్యవహారంలో కేంద్రం వైఖరి ఇబ్బందికరంగా మారిన క్రమంలోనే కఠిన వైఖరి ఎత్తుకునేలా కేసీఆర్ ప్రణాళికలు రూపొందిస్తారని తెలిసింది. ఈ క్రమంలోనే మళ్లీ ప్రధాని హైదరాబాద్ రాకముందే కేసీఆర్ తిరిగి ఢిల్లీ వెళ్తారని పార్టీ వర్గాల సమాచారం.

for telugu news live alerts like, follow and subscribe TMedia on FacebookTwitterYouTube