సాగు రైతుల పక్షపాతి సీఎం కేసీఆర్

రైతుబంధు రాకతో పెరిగిన సాగు విస్తీర్ణం

1
TMedia (Telugu News) :

సాగు రైతుల పక్షపాతి సీఎం కేసీఆర్
-రైతుబంధు రాకతో పెరిగిన సాగు విస్తీర్ణం
-ఖమ్మం మార్కెట్ కమిటీ చైర్పర్సన్ లక్ష్మీ ప్రసన్న
– కేసీఆర్ చిత్రపటానికి క్షీరాభిషేకం

టి మీడియా,జూలై o1,ఖమ్మం:
రైతుల పక్షపాతి సీఎం కేసీఆర్ అని ఖమ్మం వ్యవసాయ మార్కెట్ కమిటీ చైర్పర్సన్ లక్ష్మీ ప్రసన్న అన్నారు .
గురువారం వానాకాలం రైతుబంధు నిధుల విడుదల పురస్కరించుకొని ఆయా జిల్లాల సాగు రైతులు సీఎం కేసీఆర్ చిత్రపటానికి అభిషేకం చేశారు .
ఈ కార్యక్రమానికి హాజరైన చైర్ పర్సన్ వ్యాపారులు కార్మికులు రైతులతో కలిసి ఇ చిత్రపటానికి పాలాభిషేకం చేశారు ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ తెలంగాణ రాష్ట్ర ఆవిర్భావం తర్వాత సీఎం కేసీఆర్ ఆలోచనతో వ్యవసాయ రంగం మరింత బలోపేతం అయిందన్నారు. విత్తనం నుండి మొదలు పంట చేతికి వచ్చే వరకు తెలంగాణ ప్రభుత్వం రైతుకు అడుగడుగున అండగా ఉంటున్న సంగతి ఆమె గుర్తు చేశారు.

Also Read : రాష్ట్రస్థాయి టేబుల్ టెన్నిస్ పోటీలకు గద్దల సిరి

నిరంతర విద్యుత్, సాగునీటి ప్రాజెక్టుల నిర్మాణం, మార్కెట్లో మద్దతు ధరలు , నాణ్యమైన విత్తనాలను రైతులకు అందించడంతో నేడు వ్యవసాయ రంగానికి నూతన ఒరవడి రావడం జరిగిందన్నారు .
దేశంలో ఏ రాష్ట్ర ప్రభుత్వం అమలు చేయని విధంగా రైతు సంక్షేమ పథకాలు అమలు చేస్తున్నా ఏకైక ప్రభుత్వం తెలంగాణ ప్రభుత్వం అన్నారు. సీఎం కేసీఆర్ అత్యంత ప్రతిష్టాత్మకంగా ప్రవేశపెట్టిన రైతుబంధు , రైతు బీమా పథకాలు నేడు యావత్ దేశానికి ఆదర్శం అయ్యాయన్నారు. పంటల సాగు పెట్టుబడి బాధ్యత తీసుకున్న గొప్ప నాయకుడు సీఎం కేసీఆర్ అన్నారు. రైతు బంధు పథకం అమల్లోకి వచ్చిన తర్వాత రాష్ట్ర వ్యాప్తంగా, జిల్లాలో గణనీయంగా సాగు విస్తీర్ణం పెరిగిందన్నారు .

Also REad : మిషన్ భగీరథ నీటిపై అవగాహన

జాతీయా మార్కెట్లో సైతం తెలంగాణ రైతుల పంటలకు మంచి ధరలు పలుకుతుండటం సంతోషకరమన్నారు. రైతుబంధు సొమ్మును సద్వినియోగం చేసుకొని రైతులు ఆర్థిక అభివృద్ధి సాధించాలని ఆమె సూచించారు .
ఈ కార్యక్రమంలో ఖమ్మం వ్యవసాయ మార్కెట్ కమిటీ కార్యదర్శి ఆర్ మల్లేశం, ఆయా జిల్లాల రైతులు , కార్మికులు, వ్యాపారులు తదితరులు పాల్గొన్నారు.

for telugu news live alerts like, follow and subscribe TMedia on FacebookTwitterYouTube