మెడికల్‌ కాలేజీలను ప్రారంభించిన సీఎం కేసీఆర్‌

మెడికల్‌ కాలేజీలను ప్రారంభించిన సీఎం కేసీఆర్‌

1
TMedia (Telugu News) :

మెడికల్‌ కాలేజీలను ప్రారంభించిన సీఎం కేసీఆర్‌

టి మీడియా,నవంబర్ 15, హైదరాబాద్‌ : రాష్ట్రంలోని ఎనిమిది కొత్త జిల్లాలో నిర్మించిన మెడికల్‌ కాలేజీలను రాష్ట్ర ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖర్‌రావు వీడియోకాన్ఫరెన్స్‌ ద్వారా ప్రారంభించారు. ప్రగతి భవన్‌ నుంచి ఆయా కాలేజీలకు సీఎం ప్రారంభోత్సవం చేశారు. మంచిర్యాల, రామగుండం, జగిత్యాల, వనపర్తి, నాగర్‌కర్నూల్‌, మహబూబాబాద్‌, కొత్తగూడెం, సంగారెడ్డిలో కొత్తగా నిర్మించిన కాలేజీలను ప్రారంభించారు. ఈ సందర్భంగా సీఎం కేసీఆర్‌ కార్యక్రమంలో పాల్గొన్న అందరికీ శుభాకాంక్షలు తెలిపారు. అనంతరం మాట్లాడుతూ ‘తెలంగాణ రాష్ట్ర చరిత్రలో ఇదో సువర్ణ అధ్యాయం.

Also read : మాజీ ఎమ్మెల్యే కు ఘన నివాళులు

ఒకనాడు అనేక సమస్యలతో తాగు, సాగునీటికి, కరెంటు, మెడికల్‌ సీట్లు, ఇంజినీరింగ్‌ సీట్లకు ఎన్నో రకాల అవస్థలుపడ్డ తెలంగాణ ప్రాంతం స్వరాష్ట్రమై అద్భుతంగా ఆత్మగౌరవంతో బతుకుతూ దేశానికే మార్గదర్శకమైనటువంటి అనేక వినూత్న కార్యక్రమాలు చేపడుతూ ముందుకెళ్తున్నాం. మనం ఇవాళ ఎనిమిది కళాశాలలను ప్రారంభించుకోవడం అందరికీ గర్వకారణం’ అన్నారు. కార్యక్రమంలో మంత్రులు హరీశ్‌రావు, వేముల ప్రశాంత్‌రెడ్డి, సీఎస్‌ సోమేశ్‌కుమార్‌, పలువురు సీనియర్‌ అధికారులు పాల్గొన్నారు.

for telugu news live alerts like, follow and subscribe TMedia on FacebookTwitterYouTube