సీఎస్ శాంతికుమారికి సీఎం కేసీఆర్ శుభాకాంక్షలు
టీ మీడియా, జనవరి 11, హైదరాబాద్ : తెలంగాణ రాష్ట్ర మొట్ట మొదటి మహిళా ప్రభుత్వ ప్రధాన కార్యదర్శిగా బాధ్యతలు చేపట్టిన శాంతి కుమారికి ముఖ్యమంత్రి కేసీఆర్ శుభాకాంక్షలు తెలిపారు. తనకు సీఎస్‌గా అవకాశం కల్పించినందుకు ప్రగతి భవన్లో సీఎం కేసీఆర్‌ను శాంతికుమారి మర్యాదపూర్వకంగా కలిసి ధన్యవాదాలు తెలిపారు.ఎమ్మెస్సీమెరైన్బయాలజీ చదివిన శాంతి కుమారి అమెరికాలో ఎంబీఏ కూడా పూర్తి చేశారు. గత మూడు దశాబ్దాలుగా ఐఏఎస్‌గా పేదరిక నిర్మూలన, సమ్మిళిత అభివృద్ధి, విద్య, వైద్య ఆరోగ్య రంగాలు, స్కిల్ డెవలప్మెంట్, అటవీశాఖల్లో వివిధ హోదాల్లో సేవలందించారు.
Also Read : తెలుగు జెండా రెపరెపలాడుతోంది: సీఎం జగన్
ఐక్యరాజ్యసమితి అభివృద్ధి కార్యక్రమాల్లో రెండేళ్లపాటు పనిచేశారు. గతంలో నాలుగేళ్లపాటు సీఎం కార్యాలయంలో ప్రిన్సిపల్ సెక్రటరీగా, టీఎస్ ఐపాస్‌లో ఇండస్ట్రీ ఛేజింగ్ సెల్ స్పెషల్ సెక్రటరీగా కూడా సేవలందించారు. శాంతికుమారి ప్రస్తుతం అటవీశాఖలో స్పెషల్ చీఫ్ సెక్రటరీగా పనిచేస్తున్నారు.
for telugu news live alerts like, follow and subscribe TMedia on Facebook । Twitter । YouTube