ఉద్యోగ ప్రదాత సీఎం కేసీఆర్

టీ మీడియా, మార్చి 9,హైదరాబాద్

1
TMedia (Telugu News) :

ఉద్యోగ ప్రదాత సీఎం కేసీఆర్

 

భారీ ఉద్యోగ ప్రకటన చారిత్రాత్మకo

 

ఖమ్మం ఎంపీ నామ నాగేశ్వరరావు

 

టీ మీడియా, మార్చి 9,హైదరాబాద్:

 

తెలంగాణ సీఎం కేసీఆర్ ఉద్యోగ ప్రదాత అని టీ ఆర్ఎస్ లోక్ సభా పక్ష నేత, ఎంపీ, ఖమ్మం ఎంపీ నామ నాగేశ్వరరావు కొనియాడారు. ముఖ్యమంత్రి విడుదల చేసిన భారీ ఉద్యోగ ప్రకటన చారిత్రాత్మకమని ఆయన అభిప్రాయపడ్డారు. ఈ ప్రకటనతో నాలుగు కోట్ల తెలంగాణ ప్రజల కల పరిపూర్ణం అయ్యిందని వ్యాఖ్యానించారు. పోరాడి సాధించుకున్న రాష్ట్రంలో నీళ్లు, నిధులు, నియామకాలు కల నెరవేరిందని చెప్పారు. తెలంగాణ ఉద్యమం లో విద్యార్థులు, యువత పాత్ర కీలకమైందని అన్నారు. తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం లోని వివిధ ప్రభుత్వ శాఖలలో ఖాళీగా ఉన్నా 80 వేల 39 ఉద్యోగాలను డైరెక్ట్ రిక్రూట్మెంట్ ద్వారా భర్తీ చేస్తామని, అదేవిధంగా రాష్ట్రంలోని 11 వేల 103 కాంట్రాక్ట్ ఉద్యోగుల ను క్రమబద్ధీకరిస్తామని, రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగంలో చేరడానికి గరిష్ఠ వయో పరిమితి 10 ఏళ్ళు పెంచుదామని బుధవారం నాడు రాష్ట్ర అసెంబ్లీ లో రాష్ట్ర ముఖ్యమంత్రి కేసీఆర్ ప్రకటించడం తెలంగాణ రాష్ట్ర చరిత్రలో చారిత్రాత్మకంగా కలకాలం నిలిచిపోతుందని టీ ఆర్ఎస్ లోక్ సభా పక్ష నేత, ఎంపీ, ఖమ్మం ఎంపీ నామ నాగేశ్వరరావు అభిప్రాయపడ్డారు. రాష్ట్ర ప్రభుత్వం యంత్రాంగంలో ఉద్యోగుల పాత్ర గణనీయమైనదని ఈ వాస్తవాన్ని గుర్తించిన రాష్ట్ర ముఖ్యమంత్రి కేసీఆర్ పూర్తి కసరత్తు చేసిన పిదప ఈ నిర్ణయాన్ని ప్రతిపాదించారని ఆయన తెలిపారు. తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం నూతనంగా అమలులోకి తీసుకోవచ్చిన జోనల్ వ్యవస్థ వల్ల 95 శాతం ఉద్యోగాలు తెలంగాణ రాష్ట్రంలోని స్థానికులకే లభిస్తాయని ఆయన అన్నారు. రాష్ట్రంలో గత ఏడున్నరేళ్లలో రాష్ట్ర ప్రభుత్వ సంస్థల్లో ఉద్యోగ ఖాళీలు ఉన్న 1 లక్ష 33 వేల 942 ఖాళీలను నేరుగా భర్తీ చేయడం జరిగిందని ఆయన తెలిపారు.

Also Read : ముఖ్యమంత్రికి పాలాభిషేకం

-కేంద్ర ప్రభుత్వం ఖాళీలపై

 

బీజేపీ పోరాటం చేయాలి

 

కేంద్ర ప్రభుత్వం, సంస్థలలో 8 లక్షల 72 వేల ఉద్యోగాల ఖాళీలు ఉన్నట్లు కేంద్ర ప్రభుత్వ సర్వీసెస్ పెన్షన్ల సహాయ మంత్రి జితేంద్ర సింగ్ ఇటీవల పార్లమెంటు లో ప్రకటించారని తెలిపారు. అందువల్ల కేంద్ర ప్రభుత్వం వెంటనే కేంద్ర ప్రభుత్వ వివిధ శాఖలలో, సంస్థలలో ఖాళీగా ఉన్న ఉద్యోగాలను, నిరుద్యోగుల సంక్షేమాన్ని దృష్టిలో ఉంచుకొని భర్తీ చేయాలని ఆయన డిమాండ్ చేశారు. కేంద్ర ప్రభుత్వ ప్రతి ఐదు ఉద్యోగాలలో ఒక ఉద్యోగం ఖాళీగా ఉందని అందువల్ల ఖాళీగా ఉన్న ఉద్యోగాల భర్తీ పై బిజెపి రాష్ట్ర నాయకులు కేంద్ర ప్రభుత్వం పై ఒత్తిడి తీసుకురావాలని ఆయన కోరారు.

for telugu news live alerts like, follow and subscribe TMedia on FacebookTwitterYouTube