రూ.7 లక్షల సీఎం రిలీఫ్ ఫండ్ చెక్కు అందజేసిన ఎమ్మెల్యే దివాకర్ రావు.

రూ.7 లక్షల సీఎం రిలీఫ్ ఫండ్ చెక్కు అందజేసిన ఎమ్మెల్యే దివాకర్ రావు.

1
TMedia (Telugu News) :

రూ.7 లక్షల సీఎం రిలీఫ్ ఫండ్ చెక్కు అందజేసిన ఎమ్మెల్యే దివాకర్ రావు

టి మీడియా,మే16, లక్షెట్టిపేట:మండలంలోని ఎల్లారం గ్రామానికి చెందిన ఆకుల సత్తయ్య అనే వ్యక్తికి మెదడు లో రక్తస్రావం జరిగి పక్షవాతం రావడంతో శస్త్ర చికిత్స కోసం ప్రభుత్వం నుంచి మంజూరైన రూ.7 లక్షల చెక్కు ను ఆదివారం ఎమ్మెల్యే దివాకర్ రావు బాధితుని ఇంటికి వెళ్లి అందజేశారు.ఈ సందర్భంగా ఎమ్మెల్యే దివాకర్ రావు మాట్లాడుతూ..తమ ప్రభుత్వం ఆపదలో ఉన్న ప్రతి ఒక్కరికి అండగా నిలవడానికి సీఎం రిలీఫ్ ఫండ్ ద్వారా తక్షణమే స్పందిస్తుందన్నారు. రూ.7 లక్షల చెక్కు మంజూరు చేయించి ఆదుకోవడం కేవలం తెలంగాణ ప్రభుత్వం లోనే సాధ్యమైందన్నారు. పెద్ద పెద్ద శస్త్ర చికిత్సలకు బీదలు బాధపడవలసిన అవసరం లేదన్నారు.అంతేకాకుండా మంచిర్యాల లో రూ.500 కోట్లతో మెడికల్ కాలేజ్ ఏర్పాటు చేయడం మన నియోజక వర్గానికి దక్కిన ఘనత గా పేర్కొన్నారు.

Also Read : డీజీపీకి స్వాగతం పలికిన ఎస్పీ

నిత్యం ప్రజాసేవకే అంకితమైన తెలంగాణ ప్రభుత్వాన్ని ప్రజలు ఆదరించి,ఆశీర్వదించాలని ఆయన కోరారు. అనంతరం నడిపల్లి ట్రస్ట్ చైర్మన్ విజిత్ రావు మాట్లాడుతూ…. ప్రజల సంక్షేమం, అభివృద్ధి విషయాలే కాకుండా ప్రజల ఆరోగ్యం పై ప్రత్యేక శ్రద్ద పెడుతున్న తెలంగాణ ప్రభుత్వానికి ప్రజల మద్దతు ఎంతో అవసరమన్నారు. పార్టీ కార్యకర్తలు ప్రభుత్వ పథకాలను మరింతగా ప్రజల్లోకి తీసుకెళ్లాలని పిలుపునిచ్చారు. అనంతరం బాధిత కుటుంబానికి రూ.7 లక్షల చెక్కును స్థానిక నాయకులతో కలిసి అందజేశారు. ఈ కార్యక్రమంలో ఎల్లారం గ్రామాధ్యక్షుడు సందేల వెంకటేష్,యూత్ ప్రెసిడెంట్ కిరణ్, ప్రధాన కార్యదర్శి మల్లేష్,మార్కెట్ కమిటీ డైరెక్టర్ గొడిశెల రాజేశం,నాయకులు సత్తయ్య,పొచెయ్య,,లచ్చన్న,శారదా రాజారావు,రాజన్న,రమేష్ తదితరులు పాల్గొన్నారు.

for telugu news live alerts like, follow and subscribe TMedia on FacebookTwitterYouTube