ఎంపీ నామ సిఫార్సు తో సీఎం ఆర్ఎఫ్ మంజూరు

నామ క్యాంప్ కార్యాలయంలో చెక్కులు అందజేసిన జడ్పీ చైర్మన్

1
TMedia (Telugu News) :

ఎంపీ నామ సిఫార్సు తో సీఎం ఆర్ఎఫ్ మంజూరు
– నామ క్యాంప్ కార్యాలయంలో చెక్కులు అందజేసిన జడ్పీ చైర్మన్
టి మీడియా,జూన్ 29,ఖమ్మం:
అనారోగ్య సమస్యలతో పలు హాస్పిటల్స్ నందు చికిత్స పొందిన అనంతరం అక్కడ వారికి అయిన ఖర్చులను తమ కుటుంబ ఆర్దిక పరిస్థితుల దృష్ట్యా సీఎం సహాయ నిధి నుండి ఇప్పించి ఆదుకోవాలని కోరుతూ టీ.ఆర్.ఎస్ లోక్ సభాపక్ష నేత, ఖమ్మం పార్లమెంట్ సభ్యులు నామ నాగేశ్వరరావు క్యాంప్ కార్యాలయంలో సి.ఏం. ఆర్.ఎఫ్ కి దరఖాస్తు చేసుకోగా ఎంపీ నామ నాగేశ్వరరావు సిఫార్సు మేరకు సీఎం సహాయ నిధి నుండి మధిర నియోజకవర్గంలోని ముదిగొండ, చింతకాని, బోనకల్, మధిర, ఎర్రుపాలెం మండలాలతో పాటుగా జిల్లాలో పలు మండలాలకు చెందిన 51 మంది లబ్ధిదారులకు మంజూరైన రూ. 24,96500/- లక్షల రూపాయల సి.ఏం.ఆర్.ఎఫ్ చెక్కులను సోమవారం నాడు ఖమ్మం లోని ఎంపీ నామ క్యాంప్ కార్యాలయంలో జరిగిన కార్యక్రమంలో జడ్పీ చైర్మన్ లింగాల కమల్ రాజు, రైతు బంధు సమితి జిల్లా కన్వీనర్ నల్లమల వెంకటేశ్వరరావు లు పాల్గొని ప్రసంగించారు అనంతరం లబ్ధిదారులకు చెక్కులు అందజేశారు.

 

Also Read : ఆర్డీవో ఆకస్మిక తనిఖీ

 

ఈ కార్యక్రమంలో జిల్లా నాయకులు కనకమేడల సత్యనారాయణ, చింతకాని, ముదిగొండ, బోనకల్ మండల టీ.ఆర్.ఎస్ పార్టీ అధ్యక్షులు పెంట్యాల పుల్లయ్య , వాచేపల్లి లక్ష్మారెడ్డి ,చేబ్రోలు మల్లికార్జున్ రావు, చింతకాని ఎంపీపీ కొపూరి పూర్ణయ్య, డీసీసీబీ డైరెక్టర్ వేముల శ్రీనివాస్, టెలికాం అడ్వైజరీ కమిటీ మెంబెర్ చిత్తారు సింహాద్రి యాదవ్, మీగడ శ్రీనివాస్, తన్నీరు రవి కుమార్, జిల్లా రైతు బంధు సభ్యులు మంకెన రమేష్, రైతు బంధు మండల కన్వీనర్ లు పోట్ల ప్రసాద్ ,కిలారి మనోహర్, వేమూరి ప్రసాద్, చింతకాని వైస్ ఎంపీపీ గురిజాల హనుమంతరావు, పచ్చా సీతారామయ్య, దిశ కమిటీ సభ్యులు చింతలచెర్వు లక్ష్మీ, మండల కార్యదర్శి బొడ్డు వెంకట్రామయ్య, సర్పంచ్ లు కొమ్మినేని ఉపేందర్, దమ్మలపాటి శ్రీదేవి, యలమంద, ఆనంతరాములు, వాకదాని కోటి, భిక్షం, బందం నాగేశ్వరరావు, ముడావత్ సైదా, ఉద్దండ్, నామ సేవా సమితి సభ్యులు చీకటి రాంబాబు, తాళ్లూరి హరీష్ బాబు, రేగళ్ల కృష్ణప్రసాద్, పలువురు ప్రజాప్రతినిధులు, మండల, గ్రామ నాయకులు తదితరులు పాల్గొన్నారు.

for telugu news live alerts like, follow and subscribe TMedia on FacebookTwitterYouTube