ఖమ్మంలో జరిగే సీఎం ప్రజా ఆశీర్వాద సభను సక్సెస్ చేయాలి
– వచ్చేది బీఆర్ఎస్ ప్రభుత్వమే..డౌటే వద్దు
– కార్యకర్తల సమావేశంలో ఎంపీ నామ
టీ మీడియా, అక్టోబర్ 28, ఖమ్మం : ఎన్నికల ప్రచారంలో భాగంగా నవంబర్ 5న ఖమ్మంలో జరిగే సీఎం ప్రజా ఆశీర్వాద సభలో లక్షలాదిగా పాల్గొని సభను పెద్ద ఎత్తున సక్సెస్ చేయాలని బీఆర్ఎస్ లోక్ సభా పక్ష నేత, ఖమ్మం పార్లమెంట్ సభ్యులు నామ నాగేశ్వరరావు , మంత్రి, ఖమ్మం అభ్యర్థి పువ్వాడ అజయ్ కుమార్ ప్రజలకు పిలుపునిచ్చారు. ఖమ్మంలోని బీఆర్ఎస్ జిల్లా కార్యాలయంలో జరిగిన పార్టీ ఖమ్మం పట్టణ కార్యకర్తల సమావేశంలో నామ పాల్గొని మాట్లాడారు. ఖమ్మం టౌన్ తో పాటు ప్రతి మండలం నుంచి భారీగా సీఎం సభకు తరలి వచ్చి విజయవంతం చేయాలన్నారు. కార్యకర్తల కష్టంతో సభ అశేష జన సందోహంతో దద్దరిల్లడం ఖాయమన్నారు. కమిటీల వారీగా బాధ్యతలు తీసుకొని, సభ విజయవంతానికి శ్రమించాలని అన్నారు. ఎవరెన్ని మాయ మోసపు మాటలు చెప్పినా రాష్ట్రంలో వందకు వంద శాతం బీఆర్ ఎస్ ప్రభుత్వం వస్తుందని, ఇందులో డౌటే లేదని అన్నారు. అన్ని సర్వేలు బీఆర్ ఎస్ ప్రభుత్వం వస్తుందని, ఖమ్మం జిల్లాలో అన్ని సీట్లు బీఆర్ఎస్ గెల్చుకుంటుందని అన్ని సర్వేలు స్పష్టం చేస్తున్నాయని పేర్కొన్నారు. బీఆర్ఎస్ మ్యానిఫెస్టో బ్రహ్మాండంగా ఉందని, ప్రభుత్వ సంక్షేమ పథకాలను విస్తృతంగా ప్రజల్లోకి తీసుకెళ్లి,ప్రచారం చేయాలన్నారు.
Also Read : ఆత్మాభిమానం దెబ్బతినడం వల్లే ప్రచారాలకు దూరంగా ఉంటున్నా
ఖమ్మంలో పువ్వాడను మంచి మెజార్టీతో గెలిపించుకుని మిగిలిపోయిన అభివృద్ధిని చేసుకుందామని నామ అన్నారు. సమావేశంలో మంత్రి పువ్వాడ అజయ్ కుమార్ , రాజ్యసభ ఎంపీ వద్దిరాజు రవిచంద్ర, ఎమ్మెల్సీ తాతా మధు, మధిర అభ్యర్ది , జెట్పీ చైర్మన్ లింగాల కమలరాజ్, డీసీసీబీ చైర్మన్ కూరాకుల నాగభూషణం, కొండబాల కోటేశ్వరరావు, బచ్చు విజయ్ కుమార్, మేయర్ నీరజ, ఏఎంసీ చైర్మన్ శ్వేత, పార్టీ ఖమ్మం పట్టణ అధ్యక్షులు నాగరాజు, కార్పొరేటర్లు, వివిధ డివిజన్ల నాయకులు తదితరులు పాల్గొన్నారు.
for telugu news live alerts like, follow and subscribe TMedia on Facebook । Twitter । YouTube