సేవకు చిరు”నామ”

సేవకు చిరు"నామ"

0
TMedia (Telugu News) :

 

paramarsa
paramarsa

ఎంపీ నామ క్యాంప్ కార్యాలయంలో సీఎంఆర్ఎఫ్ చెక్కుల పంపిణీ

రైతు బంధు సమన్వయ సమితి జిల్లా కన్వీనర్ నల్లమల వెంకటేశ్వరరావు

ఖమ్మం , సెప్టెంబర్ 10 : మెరుగైన సేవలకు, సాయానికి చిరునామా ఎంపీ నామ అని రైతు బంధు సమన్వయ సమితి జిల్లా కన్వీనర్ నల్లమల వెంకటేశ్వరరావు పేర్కొన్నారు. టీఆర్ఎస్ లోక్ సభా పక్ష నేత , ఖమ్మం పార్లమెంట్ సభ్యులు నామ నాగేశ్వరరావు ప్రత్యేక సిఫార్స్ తో ఎనిమిది మందికి మంజూరైన రూ .3 లక్షల 92 వేల విలువైన సీఎంఆర్ఎఫ్ చెక్కులను శనివారం ఖమ్మంలోని ఎంపీ క్యాంప్ కార్యాలయంలో జరిగిన కార్యక్రమంలో కనకమేడల నత్యనారాయణతో కలసి లబ్దిదారులకు అందజేశారు. ఈ సందర్భంగా నల్లమల మాట్లాడుతూ ఎంపీ నామ సీఎం కేసీఆర్ తో ప్రత్యేకంగా మాట్లాడి ఉమ్మడి ఖమ్మం జిల్లా ప్రజలకు పెద్ద ఎత్తున అభివృద్ధి ఫలాలు అందే విధంగా చేస్తున్నారని నల్లమల తెలిపారు. ప్రతి పథకంలో మహిళలకు ప్రధమ ప్రాధాన్యత ఇచ్చి, వారిని ప్రోత్సహిస్తున్నారని చెప్పారు. ఇప్పటికే ఈ పథకం కింద వేలాది నిరు పేద కుటుంబాలకు ఆర్ధిక భరోసా కల్పించడం నామ సేవా నిరతికి తార్కాణమని అన్నారు. లబ్దిదారులు క్యాంప్ ఆఫీస్ కు వెళ్ళి దరఖాస్తు అందజేయగానే నామ తక్షణమే స్పందించి, సమస్యను పరిష్కరిస్తున్నారని చెప్పారు . పేదలంటే నామకు అమితమైన అభిమానమన్నారు. ప్రతి సమస్యను సకాలంలో పరిష్కరించగల సత్తా ఉన్న నాయకుడు నామ అని చెప్పారు. ఇటువంటి నాయకులను గుండెల్లో పెట్టుకుని, రానున్న కాలంలో మళ్లీ గెలిపించుకుని, అక్కున చేర్చుకోవాల్సిన బాధ్యత మనందరిపైనా ఉందన్నారు. తెలంగాణ అభివృద్ధిని చూసి మిగతా రాష్ట్రాలు ఆశ్చర్యపోతున్నాయని అన్నారు. సీఎం కేసీఆర్ దేశ్ కీ నేత అయితేనే దేశం కూడా తెలంగాణ మాదిరిగా ప్రగతి పధంలో దూసుకుపోతుందని అన్నారు. ఇప్పుడున్న సంక్షోభంలో దేశానికి కేసీఆర్ లాంటి విజన్ ఉన్న నేత అత్యవసరమని, ఆయనకు మనమంతా మద్దతుగా నిలవాలని పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో టీఆర్ఎస్ వైరా రూరల్ మండల అధ్యక్షులు బాణాల వెంకటేశ్వర్లు, నాయకులు కనకమేడల సత్యనారాయణ, పాల్వంచ మండలం తోగ్గూడెం గ్రామ శాఖ అధ్యక్షులు బాదావత్ శ్రీను, పార్టీ కార్యకర్తలు భూక్యా కృష్ణ, కుంజా అశోక్, నామ సేవా సమితి నాయకులు చీకటి రాంబాబు, కృష్ణప్రసాద్ , మునిగంటి భార్గవ్ తదితరులు పాల్గొన్నారు .

బాధిత కుటుంబానికి పరామర్శ

ఏన్కూరు మండలం లచ్చగూడెంలో ఇటీవల మృతి చెందిన నల్లమల నాగేశ్వరరావు కుటుంబ సభ్యులను రైతు బంధు సమన్వయ సమితి జిల్లా కన్వీనర్ నల్లమల వెంకటేశ్వరరావు, పార్టీ నాయకులు కనకమేడల సత్యనారాయణ, మండల నాయకులు వాసిరెడ్డి నాగేశ్వరరావు మండల వ్యవసాయ అధికారి నరసింహారావు, నామ సేవా సమితి నాయకులు చీకటి రాంబాబు తదితరులు పరామర్శించి, సంతాపం తెలిపారు. మృతుడి చిత్ర పటానికి పూలమాల వేసి, శ్రద్ధాంజలి ఘటించి, నివాళులు అర్పించారు. మృతుడి సోదరుడు శివకుమార్ తో మాట్లాడి, మనోధైర్యం కల్పించి సానుభూతి వ్యక్తం చేశారు .

for telugu news live alerts like, follow and subscribe TMedia on FacebookTwitterYouTube