ఎంపీ నామ చొరవతో భారీగా సీఎంఆర్ఎఫ్ చెక్కులు మంజూరు

ఎంపీ నామ చొరవతో భారీగా సీఎంఆర్ఎఫ్ చెక్కులు మంజూరు

1
TMedia (Telugu News) :

ఎంపీ నామ చొరవతో భారీగా సీఎంఆర్ఎఫ్ చెక్కులు మంజూరు

టీ మీడియా, ఆగస్ట్ 25, అశ్వారావుపేట : టీఆర్ఎస్ లోక్ సభా పక్ష నేత, ఎంపీ నామ నాగేశ్వరరావు చొరవ, అవిరళ కృషి, స్థానిక నాయకత్వం కష్టంతో సీఎంఆర్ఎఫ్ కింద పేదలకు పెద్ద ఎత్తున ఆర్ధిక భరోసా కల్పించడం జరుగుతుందని అశ్వారావుపేట ఎమ్మెల్యే మెచ్చా నాగేశ్వరరావు అన్నారు. ఎంపీ నామ నాగేశ్వరరావు చొరవ, స్థానిక ఎమ్మెల్యే మెచ్చా నాగేశ్వరరావు సహకారంతో అశ్వారావుపేట నియోజకవర్గానికి చెందిన 106 మందికి మంజూరైన రూ.36,54,300 విలువైన సీఎంఆర్ఎఫ్ చెక్కులను గురువారం ఎమ్మెల్యే క్యాంప్ కార్యాలయంలో జరిగిన కార్యక్రమంలో స్థానిక నాయకులతో కలిసి ఎమ్మెల్యే మెచ్చా లబ్ధిదారులకు అందజేశారు.ఈ సందర్బంగా ఎమ్మెల్యే మెచ్చా మాట్లాడుతూ గతంలో ఎన్నడూ లేని విధంగా సీఎం కేసీఆర్ పేదలను సీయంఆర్ఎఫ్ ద్వారా ఆదుకుంటున్నారని అన్నారు. పేదల సంక్షేమమే లక్ధ్యంగా సీఎం కేసీఆర్ పెద్ద ఎత్తున సంక్షేమ పథకాలు అమలు చేస్తున్నారని తెలిపారు. ఖమ్మం జిల్లా రైతు బంధు కన్వీనర్ నల్లమల వెంకటేశ్వరరావు మాట్లాడుతూ ఎంపీ నామ నాగేశ్వరరావు పేదల పక్షపాతిగా మారారని అన్నారు. నామ ప్రత్యేక చొరవ, కృషి వల్ల నేడు పండుగ వాతావరణంలో సీఎంఆర్ఎఫ్ చెక్కులను పంచుకుంటున్నామని తెలిపారు.

 

Also Read : ట్రిపుల్ ఐటీ విద్యార్థికి ఘనంగా సన్మానం

 

అశ్వారావుపేట నియోజకవర్గoలోని అశ్వారా వుపేట, దమ్మపేట, ములకలపల్లి, అన్నపురెడ్డిపల్లి మండలాలకు చెందిన 76 మందికి నామ కృషితో రూ.27, 88,300 విలువైన చెక్కులు మంజూరయ్యాయని, వీటిని పేదలకు అందజేశామని తెలిపారు. పేదల వద్దకే వెళ్లి చెక్కులను అందజేయాలని నామ ఆదేశించారని చెప్పారు.ఎంపీ నామ పేదలకు ప్రధమ ప్రాధాన్యత ఇచ్చి ఆపదలో ఆర్ధికంగా ఆదుకుంటున్నారని చెప్పారు . ఈ కార్యక్రమంలో పార్టీ అశ్వారావుపేట మండల జెడ్పీటీసీ చిన్నంశెట్టి వరలక్ష్మి, ఎంపీపీ జల్లిపల్లి శ్రీరామ్ మూర్తి, టిఆర్ఎస్ మండల అధ్యక్షుడు బండి పుల్లారావు, వైస్ ఎంపీపీ ఫణీంద్ర, మండల రైతు సమన్వయ కమిటీ అధ్యక్షుడు జూపల్లి రమేష్, పార్టీ పట్టణ అధ్యక్షుడు సంపూర్ణ , మాటూరి మోహన్, దమ్మపేట మండలం నుంచి ఎంపీపీ సోయం ప్రసాద్, దిశా కమిటీ సభ్యుడు గారపాటి సూర్యనారాయణ, సొసైటీ చైర్మన్ రావు జోగేశ్వరరావు, పార్టీ నాయకులు జారే ఆదినారాయణ, మండల ప్రధాన కార్యదర్శి దొడ్డా రమేష్, టిఆర్ఎస్వి నియోజకవర్గ అధ్యక్షుడు వేంపాటి భరత్, రైతు సమన్వయ కమిటీ అధ్యక్షుడు ధార యుగంధర్, ములకలపల్లి ఎంపీపీ మెట్ల నాగమణి, మండల అధ్యక్షుడు మోరంపూడి అప్పారావు, సర్పంచి కారం సుధీర్ ,చండ్రుగొండ మండల ఉపాధ్యక్షులు ఉప్పునూతల ఏడుకొండలు, భూపతి రమేష్, అబ్బాస్ ఆలీ, అన్నపురెడ్డిపల్లి మండల ఉపాధ్యక్షులు , రైతు సమన్వయ సమితి అధ్యక్షులు కొత్తూరు వెంకటేశ్వర్లు, తదితరులు పాల్గొన్నారు

for telugu news live alerts like, follow and subscribe TMedia on FacebookTwitterYouTube