అన్ని వర్గాల సంక్షేమం సీఎం కేసీఆర్ ఘనతే.. ఎంపీ నామ
అన్ని వర్గాల సంక్షేమం సీఎం కేసీఆర్ ఘనతే.. ఎంపీ నామ
అన్ని వర్గాల సంక్షేమం సీఎం కేసీఆర్ ఘనతే.. ఎంపీ నామ
కేసీఆర్ అమలు చేస్తున్న సంక్షేమ పథకాలతో పేదల జీవితాల్లో వెలుగులు.
ఎంపీ నామ సిఫార్సు తో రూ.1,50,000/- రూపాయల CMRF చెక్ మంజూరు.
ఖమ్మం, మే 07.
తెలంగాణ సమాజంలోని అన్ని వర్గాల సంక్షేమానికి కృషి చేస్తున్న ఘనత సీఎం కేసీఆర్‌దే. ఎన్నో పార్టీల సీఎంలు పరిపాలించినా సంక్షేమ పథకాలు అందరికీ అందేవి కావు. కానీ, నేడు పార్టీలకతీతంగా అర్హులందరికీ సంక్షేమ పథకాలు అందుతున్నాయని టీ.ఆర్.ఎస్ లోక్ సభాపక్ష నేత, ఖమ్మం పార్లమెంట్ సభ్యులు నామ నాగేశ్వరరావు పేర్కొన్నారు. పేదల సంక్షేమమే ధ్యేయంగా తమ సర్కారు కృషి చేస్తున్నదని, ఎటువంటి కష్టమొచ్చినా సీఎం సహాయ నిధి పేదలకు కొండంత భరోసా ఇస్తుందన్నారు. ఖమ్మం నగరానికి చెందిన సుంకర ప్రభ రాణి అనారోగ్యంతో బాధపడుతూ ఖమ్మం లోని ఒక ప్రైవేటు హాస్పిటల్ నందు చికిత్స పొందిన అనంతరం ఎంపీ నామ క్యాంప్ కార్యాలయం నుండి సీఎం సహాయ నిధికి దరఖాస్తు చేసుకోగా ఎంపీ నామ సిఫార్సు మేరకు రూ.1,50,000 (లక్ష యాబై వేల రూపాయల) CMRF చెక్ మంజూరు అయింది. కాగా ఆ చెక్ ను శనివారం నాడు ఖమ్మం లోని ఎంపీ నామ తన నివాసంలో లబ్ధిదారునికి తెరాస జిల్లా అధ్యక్షుడు, ఎమ్మెల్సీ తాతా మధుసూదన్ తో కలసి అందజేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ తెలంగాణ రాష్ట్ర ఏర్పాటు తర్వాత ముఖ్యమంత్రి కేసీఆర్ అమలు చేస్తున్న సంక్షేమ పథకాలతో పేదల ఇళ్లల్లో వెలుగులు నిండాయని తెలిపారు అన్ని వర్గాలకు టీ.ఆర్.ఎస్ సర్కారు పెద్దపీట వేస్తూ సంక్షేమ పథకాలు అమలు చేయడం జరుగుతుందని ఆయన పేర్కొన్నారు. సంక్షేమం, అభివృద్ధి రెండింటి లో తెలంగాణ రాష్ట్రం దేశానికే ఆదర్శంగా నిలిచిందని గుర్తు చేశారు అనారోగ్యంతో చికిత్స పొందిన నిరుపేద కుటుంబాల వారికి సీఎం సహాయ నిధి నుండి కొంత వరకు ఆర్దిక సహాయం అందించి ఆదుకోవడం గొప్ప పరిణామం అని స్పష్టం చేశారు. కార్యక్రమంలో రైతు బంధు జిల్లా కన్వీనర్ నల్లమల వెంకటేశ్వరరావు, నాయకులు చిత్తారు సింహాద్రి యాదవ్, వైరా మండల పార్టీ అధ్యక్షుడు బాణాల వెంకటేశ్వరరావు, నామ సేవా సమితి సభ్యులు పాల్వంచ రాజేష్, చీకటి రాంబాబు, తాళ్లూరి హరీష్ బాబు, రేగళ్ల కృష్ణప్రసాద్ తదితరులు పాల్గొన్నారు.