నిరుపేదలకు వరం సిఎం ఆర్ఎఫ్ పథకం

- బీరం బిచ్చమ్మ

1
TMedia (Telugu News) :

నిరుపేదలకు వరం సిఎం ఆర్ఎఫ్ పథకం

 

– బీరం బిచ్చమ్మ

టీ మీడియా, నవంబర్ 5, చిన్నంబావి : చిన్నంబావి మండలం లక్ష్మిపల్లి గ్రామానికి చెందిన బి.అలివేలమ్మ అనారోగ్యంతో బాధపడుతూ హైదరాబాద్ నిమ్స్ ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నారు,మెరుగైన వైద్యం చేయించుకోవడం కోసం తమ పరిస్థితిని ఎమ్మెల్యే బీరం హర్షవర్ధన్ రెడ్డి కి వివరించగా ఎమ్మెల్యే స్పందించి సీఎం ఆర్ ఎప్ పథకం కింద లక్ష ఇరువై ఐదు వేల రూపాయల ఎల్వొసిని మంజూరు చేయించారు.

Also Read : ప్రభుత్వ విప్ బాల్క సుమన్ ఆర్ధిక సహాయం

వారి కుటుంబ సభ్యులకు ఎల్వొసిని అందచేసిన ఎమ్మెల్యే హర్షవర్ధన్ రెడ్డి మాతృ మూర్తి బీరం బిచ్చమ్మ ఆమె మాట్లాడుతూ పేద ప్రజలకు సీఎం ఆర్ ఎప్ పథకం ఒక గొప్ప వరం అని ఆమె అన్నారు.ఈ సందర్భంగా అలివెలమ్మ కుటుంబ సభ్యులు మాట్లాడుతూ తమ వినతిని మన్నించి ప్రత్యేక చొరవ తీసుకుని లక్ష ఇరువై ఐదు వేల రూపాయల ఎల్వొసిని మంజూరు చేయించినందుకు ఎమ్మెల్యే బీరం హర్షవర్ధన్ రెడ్డి కి ఈ ప్రత్యేక కృతజ్ఞతలు తెలిపారు.

for telugu news live alerts like, follow and subscribe TMedia on FacebookTwitterYouTube