దంపతుల ఆత్మహత్యపై సీఎం విచారణ

దంపతుల ఆత్మహత్యపై సీఎం విచారణ

1
TMedia (Telugu News) :

దంపతుల ఆత్మహత్యపై సీఎం విచారణ

టీ మీడియా,సెప్టెంబర్ 8, రాజమహేంద్రవరం : తూర్పు గోదావరి జిల్లా రాజమహేంద్రవరంలో రుణయాప్‌ నిర్వాహకుల వేధింపుల కారణంగా బలవన్మరణం పొందిన దంపతుల ఘటనపై ఏపీ సీఎం జగన్‌ విచారణ వ్యక్తం చేశారు. దంపతుల ఇద్దరు పిల్లల సంరక్షణకు ఏర్పాట్లు చేయాలని జిల్లా కలెక్టర్‌కు ఆదేశించారు. అనాథలైన ఇద్దరు పిల్లలకు రూ. 5లక్షల చొప్పున ఆర్థిక సహాయం అందించాలని పేర్కొన్నారు. అల్లూరి సీతారామరాజు జిల్లా రాజవొమ్మంగి మండలం లబ్బర్తికి చెందిన కొల్లి దుర్గారావు, భార్య రమ్మకృష్ణ పదేళ్ల కిందట జీవనోపాధి కోసం రాజమహేంద్ర వరం వచ్చారు. వీరికి తేజస్వి నాగసాయి(4), లిఖితశ్రీ(2) ఇద్దరు సంతానం . దుర్గారావు పెయింటింగ్‌ , రమ్యకృష్ణ టైలరింగ్‌ చేస్తు కుటుంబాన్ని పోషించుకుంటు న్నారు.

Also Read : నిర్మలమైన మనసుతో ముందుకు సాగుతా

ఆర్థిక సమస్యలతో రుణయాప్‌ల ద్వారా కొంత లోను తీసుకున్నారు. వీటి చెల్లింపునకు నిర్వాహకుల నుంచి వచ్చిన ఒత్తిళ్లతో కొంత డబ్బును తిరిగి చెల్లించగా మరికొంత చెల్లిం చేందుకు గడువు కోరారు. అయిన నిర్వాహకులు ససేమిరా అనడంతో పాటు భార్య రమ్యకృష్ణ ఫొటోను మార్ఫింగ్‌ చేసి అసభ్యకరంగా సామాజిక మాధ్యమాల్లో పెడతామని హెచ్చరించారు. దీంతో దంపతులు మానసికంగా కుంగిపోయి ఈనెల 5న రాజమహేంద్రవరంలోని ఒక లాడ్జిలో గది అద్దెకు తీసుకుని ఆత్మహత్యకు పాల్పడ్డారు.

for telugu news live alerts like, follow and subscribe TMedia on FacebookTwitterYouTube