సీఎం ప్రమాణస్వీకారం ఏర్పాట్లు ప‌రిశీలించిన సీఎస్

సీఎం ప్రమాణస్వీకారం ఏర్పాట్లు ప‌రిశీలించిన సీఎస్

0
TMedia (Telugu News) :

సీఎం ప్రమాణస్వీకారం ఏర్పాట్లు ప‌రిశీలించిన సీఎస్

టీ మీడియా, డిసెంబర్ 6, హైదరాబాద్ : తెలంగాణ నూతన సీఎం ప్రమాణస్వీకారానికి జ‌రుగుతున్న ఏర్పాట్లను సీఎస్ శాంతికుమార్‌, డీజీపీ ర‌విగుప్తాలు ప‌రిశీలించారు. హైదరాబాద్‌లోని ఎల్బీ స్టేడియంలో ఈరోజు మధ్యాహ్నం 1.04 గంటలకు రేవంత్‌రెడ్డి సీఎంగా ప్రమాణ స్వీకారం చేయనున్నారు. ఈ నేపథ్యంలో అక్కడ జరుగుతున్న ఏర్పాట్లను సీఎస్‌ శాంతికుమారి, డీజీపీ రవిగుప్తా, ఇతర శాఖల ఉన్నతాధికారులు పరిశీలించారు. చేస్తున్న ఏర్పాట్లు, బందోబస్తు తదితర అంశాలపై డీజీపీ, జీహెచ్‌ఎంసీ ఉన్నతాధికారులను సీఎస్‌ అడిగి తెలుసుకున్నారు. మరోవైపు ప్రమాణ స్వీకార కార్యక్రమం నిర్వహణ, ఏర్పాట్లపై ఎల్బీ స్టేడియంలో సమన్వయ సమావేశం నిర్వహించారు. కాంగ్రెస్‌ నేతలతో పోలీసు, సాధారణ పరిపాలన శాఖ అధికారులు చర్చించారు.

Also Read : కాంగ్రెస్ ప్రభుత్వం కూలుతుంది.. బీజేపీ వస్తుంది

 

for telugu news live alerts like, follow and subscribe TMedia on FacebookTwitterYouTube