వంట గ్యాస్ సిలిండర్లలో మోసం -వ్యాన్ అడ్డుకున్న వినియోగదారులు
టీ మీడియా,మార్చ్ 4, సత్తుపల్లి : గ్యాస్ సిలిండర్లలో గ్యాస్ ఉండాల్సిన దానికంటే తక్కువగా ఉండటంతో వినియోగదారులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. గ్యాస్ సిలెండర్లను సరఫరా చేసే వారిని ఈ విషయంపై ప్రశ్నించినా తమకేమీ సంబంధం లేదంటూ నిర్లక్ష్యంగా సమాధానం చెపుతున్నారని వాపోతున్నారు. సత్తుపల్లి పట్టణంలో ఒకే కంపెనీకి చెందిన ఇద్దరు డీలర్లున్నారు. ఒక డీలర్‌కు సంబంధించి వంట గ్యాస్ సిలిండర్లు సరఫరా అవుతండగ సిలిండర్లలో గ్యాస్ తక్కువగా ఉంటోందని పలువురు వినియోగదారులు ఆరోపిస్తున్నారు. గ్యాస్ సిలిండర్లను అధికారులు తరచూ తనిఖీ చేయాలనే డిమాండ్ వినియోగదారుల నుంచి వస్తోంది. సత్తుపల్లికి చెందిన ఒక గ్యాస్ డీలర్ వద్ద నుంచి భద్రాద్రి కొత్తగూడెం జిల్లా దమ్మపేట మండలం ముష్టిబండలో గ్యాస్ డెలివరీకి సిలిండర్లతో వెళ్లిన వ్యాన్‌ను అక్కడ వినియోగదారులు పట్టుకున్నారు. ఒక్కో సిలిండర్‌లో మూడు నుంచి నాలుగు కిలోల గ్యాస్ తక్కువగా ఉందని ఆరోపిస్తూ వ్యాన్‌ను అక్కడి అధికారులకు అప్పగించారు. ముష్టిబండలో పట్టుకున్న వ్యాన్ వివరాలు సోషల్ మీడియాలో వైరల్ కావటంతో సత్తుపల్లి పట్టణంలో కలకలం రేగింది.గ్యాస్ చోరీ జరుగుతోందా….సిలిండర్లలో వంట గ్యాస్‌ను తీసి వేరే సిలిండర్లలోకి నింపి సొమ్ము చేసుకుంటున్నారనే ఆరోపణలు వినియోగదారుల నుంచి వెల్లువెత్తుతున్నాయి. గ్యాస్ అక్రమ ఫిల్లింగ్ను అడ్డుకోవాల్సి ఉన్నా తనిఖీలు నామమాత్రంగా జరుగుతున్నాయనే ఆరోపణలున్నాయి. గ్యాస్ సిలిండర్లలో గ్యాస్ తగ్గటం వెనుక కారణాలు ఏమిటనే విషయంపై అధికారులు పూర్తి స్థాయి విచారణ చేయాల్సి ఉంది. సాధారణంగా కంపెనీ నుంచి వచ్చే సిలిండర్లలో ఒక ులోడులో ఒకటి రెండు సిలిండర్లలో రెండు కిలోల గ్యాస్ వరకూ తగ్గే అవకాశం ఉందని అలాంటి వాటిని గుర్తించి డీలర్లు కంపెనీకి తిప్పి పంపాల్సి ఉంటుంది. కాని ఇక్కడ పరిస్థితి అందుకు భిన్నంగా ఉంది. దమ్మపేట మండలం డెలివరీకి వెళ్లిన గ్యాస్ సిలిండర్లలో మూడు నుంచి నాలుగు కిలోల గ్యాస్ తక్కువ ఉండటం వెనుక అక్రమాలు ఉన్నాయనే అనుమానాలు వ్యక్తం అవుతున్నాయి.
మొత్తంగా దమ్మపేట మండలంలో గ్యాస్ తక్కువ ఉన్న సిలిండర్లు స్థానికులకు పట్టుబడటంతో కొంత కాలంగా సత్తుపల్లి పట్టణంలో గ్యాస్ సిలిండర్లలో గ్యాస్ తక్కువగా ఉంటోందనే ఆరోణలకు బలాన్నిస్తోంది. ఇప్పటికైనా సత్తుపల్లిలో అధికారులు తనిఖీలు విస్తృతం చేయాలని వినియోగదారులు కోరుతున్నారు.ఇలా వెలుగులోకి వచ్చిందిఓ ఏజెన్సీ సరఫరా చేసిన సిలిండర్లలో గ్యాస్ తక్కువగా ఉం దని వినియోగదారులు నిలదీసిదిశారు. ఘటన దమ్మపేట మండలం ముష్టిబండలో గురువారం జరిగింది. ఈఘటనకు సంధించి స్థానికులు తెలిపిన వివరాల ప్రకారం సత్తుపల్లికి చెందిన ఓ ఏజెన్సీ ముష్టిబండకు చెందిన కొంతమంది వినియోగదారులకు గ్యాస్‌ను సరఫరా చేస్తోంది.
alsoread భార్యను హత్య చేసిన భర్త
ఈక్రమంలో గురువారం వ్యాన్ ముష్టిబండకు రాగా కొందరు వినియోగదారులు గ్యాస్ సిలిండర్లను కొనుగొలు చేశారు. కానీ గ్యాస్ సిలిండర్లు తేలికగా ఉండటంతో తూకం వేయగా 2నుంచి 3కిలోల వరకు గ్యాస్ తక్కువగా ఉండటాన్ని గుర్తించారు. గ్యాస్ డెలివరీ వారిపై ఆగ్రహం వ్యక్తం చేశారు. వ్యాన్ అడ్డుకుని నిలదీశారు. కొందరు దమ్మపేట రెవెన్యూ అధికారులకు ఫిర్యాదు చేశారు. ఈక్రమంలో ఆర్ఐ ముష్టిబండకు చేరుకొని గ్యాస్ సిలిండర్లతో సహా వ్యానును దమ్మపేట రెవెన్యూ కార్యాలయానికి తరలించారు. ఈవిషయంపై తహసీల్ధార్ రంగా ప్రసాద్‌ను వివరణ కోరగా ‘తనకు కొందరు సిలిం డర్లలో గ్యాస్ తక్కువగా ఉందని ఫిర్యాదు చేశారు. దీంతో సిలండర్లతో సహా వ్యాన్‌ను రెవెన్యూ కార్యాలయానికి తరిలించామన్నారు. గ్యాస్ తక్కువగా వస్తున్న ఆరోపణలపై తూనికల కొలతల అధికారులకు అప్పగించి విచారణ జరుపుతామని’ వివరించారు.
for telugu news live alerts like, follow and subscribe TMedia on Facebook । Twitter । YouTube