భారీ వర్షాలకు కూలిన బిల్డింగ్‌.. ఇద్దరు మృతి

భారీ వర్షాలకు కూలిన బిల్డింగ్‌.. ఇద్దరు మృతి

1
TMedia (Telugu News) :

భారీ వర్షాలకు కూలిన బిల్డింగ్‌.. ఇద్దరు మృతి
టి మీడియా,జూలై 23,వరంగల్: జిల్లాలోని మండిబజార్‌లో విషాదం చోటు చేసుకుంది. ఎడతెరపి లేకుండా కురుస్తున్న వానలతో శనివారం తెల్లవారుజామున మండిబజార్‌లోని ఓ పురాతన భవనం కూలిపోయింది. శిథిలాలు పక్కనే ఉన్న రేకుల షెడ్డుపై పడటంతో అందులో ఉన్న 60 ఏండ్ల వృద్ధుడు పైడి, ఫిరోజ్ (20) అనే యువకుడు అక్కడికక్కడే మృతిచెందారు.

 

Also Read : భద్రాచలం వద్ద మళ్లీ పెరిగిన వరద ఉధృతి

సమ్మక్క అనే మహిళ తీవ్రంగా గాయపడింది. సమాచారం అందుకున్న పోలీసులు సహాయక చర్యలు చేపట్టారు. గాయపడిన మహిళను దవాఖానకు తరలించారు. చనిపోయిన ఫిరోజ్‌కు నేడు నిశ్చితార్ధం జరగాల్సి ఉంది. ఈఘటనపై కేసు నమోదుచేసిన పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.

for telugu news live alerts like, follow and subscribe TMedia on FacebookTwitterYouTube