కూలిన ప్రహరీగోడ.

ఐదుగురు దుర్మరణం

2
TMedia (Telugu News) :

కూలిన ప్రహరీగోడ..

-ఐదుగురు దుర్మరణం

టీ మీడియా,సెప్టెంబర్ 20,లక్నో : ఉత్తరప్రదేశ్‌ నోయిడా సెక్టార్‌-21లో ఘోర ప్రమాదం చోటు చేసుకున్నది. ప్రహరీగోడ కూలిపోయిన ఘటనలో ఐదుగురు దుర్మరణం చెందారు. మరికొద్ది మంది శిథిలాల కింద చిక్కుకొని ఉంటారని భావిస్తున్నారు. సమాచారం ప్రకారం.. డ్రెయిన్‌ మరమ్మతులు చేస్తున్న సమయంలో 200 మీటర్ల పొడవున ప్రహరీ గోడ కూలిపోయినట్లుగా తెలుస్తున్నది.

Also Read : అధిక వడ్డీలతో ప్రజల ప్రాణాలను తోడేస్తున్న వ్యాపారులు

ఆ సమయంలో అక్కడ 12 మంది కూలీలు పని చేస్తున్నారు. స్థానికుల పోలీసులకు సమాచారం అందించారు. సంఘటనా స్థలానికి పోలీసులు, రెస్క్యూ బృందాలు చేరుకొని.. శిథిలాలను తొలగిస్తున్నాయి. ఘటనకు సంబంధించి ఇంకా పూర్తి వివరాలు తెలియాల్సి ఉన్నది.

for telugu news live alerts like, follow and subscribe TMedia on FacebookTwitterYouTube