ఉద్యోగుల సీనియార్టి జాబితా పకబ్బందీగా తయారు చేయాలని జిల్లా కలెక్టర్ అనుదీప్ అధికారులను ఆదేశించారు.

0
TMedia (Telugu News) :

టీ మీడియా, డిసెంబర్, 29, భద్రాచలం

బుధవారం సబ్ కలెక్టర్ కార్యాలయపు సమావేశపు హాలులో ఉద్యోగుల కేటాయింపు, సీనియార్టి తయారు, ఐ ఎఫ్ ఎం ఎస్ లో నమోదు తదితర అంశాలపై జిల్లా అధికారులతో సమీక్ష నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ పోస్టులు కేటాయింపులో స్పౌజ్ ప్రాధాన్యతను ఇవ్వాలని చెప్పారు. ఉద్యోగుల సీనియార్టి, ప్రత్యేక కేటగిరి ఉన్న సిబ్బంది జాబితా పరిశీలనకు నియమించిన కమిటి పరిశీలన పూర్తయినట్లు చెప్పారు. ఇతర జిల్లాల నుండి మన జిల్లాకు వచ్చిన సిబ్బంది మన జిల్లా సిబ్బందిని కలిపి సీనియార్టి రూపకల్పన చేయాలని చెప్పారు. కేడర్ వారిగా జాబితా తయారు చేయాలని, ఏ మాత్రం పొరపాటు జరుగకుండా నిశిత పరిశీలన చేయాలని చెప్పారు. పోస్టులు కేటాయింపు ప్రక్రియ అత్యంత పారదర్శకంగా జరుగుతుందని ఆయన స్పష్టం చేశారు. జిల్లాకు కేటాయించిన సిబ్బంది జాబితా రూపకల్పనకు జారీ చేసిన ప్రొఫార్మాలు 1, 2, లను అన్ని శాఖల అధికారులు పకడ్బందీగా తయారు చేశారని అభినందించారు. పోస్టులు కేటాయింపు ప్రక్రియ పూర్తయిన సిబ్బంది వివరాలను ఐఎఫ్యంస్ నందు నమోదు చేయనున్నట్లు ఆయన వివరించారు. ఈ సమావేశంలో అదనపు కలెక్టర్ వెంకటేశ్వర్లు, అన్ని శాఖల అధికారులు తదితరులు పాల్గొన్నారు.

for telugu news live alerts like, follow and subscribe TMedia on FacebookTwitterYouTube