భార్యా, పిల్లలను తుపాకీతో కాల్చి..

-కలెక్టర్‌ గన్‌మెన్‌ ఆత్మహత్య

0
TMedia (Telugu News) :

భార్యా, పిల్లలను తుపాకీతో కాల్చి..

-కలెక్టర్‌ గన్‌మెన్‌ ఆత్మహత్య

టీ మీడియా, డిసెంబర్ 15, సిద్దిపేట : సిద్దిపేట జిల్లాలోని చిన్నకోడూరు మండలం రామునిపట్లలో విషాదం చోటుచేసుకున్నది. భార్యా, ఇద్దరు పిల్లలతో సహా తుపాకీతో కాల్చుకుని కలెక్టర్‌ గన్‌మెన్‌ ఆత్మహత్య చేసుకున్నాడు. ఆకుల నరేశ్‌ అనే కానిస్టేబుల్‌ కలెక్టర్‌ గన్‌మెన్‌గా విధులు నిర్వహిస్తున్నారు. ఈ క్రమంలో శుక్రవారం ఉదయం విధులు ముగించుకుని ఇంటికి వచ్చిన నరేశ్‌.. తన భార్య చైతన్య, కుమారుడు రేవంత్‌, కూతురు హిమశ్రీని తుపాకీతో కాల్చాడు.

అనంతరం తానుకూడా కాల్చుకుని బలవన్మరణానికి పాల్పడ్డాడు. సమాచారం అందుకున్న పోలీసులు ఘటనా స్థలానికి చేరుకున్నారు. ఆత్మహత్యకు గల కారణాల గురించి ఆరా తీస్తున్నారు. ఈ ఘటనపై కేసు నమోదుచేసి దర్యాప్తు చేస్తున్నారు.

Also Read : బాధిత కుటుంబానికి ఆర్థిక సహాయం అందించిన డా.జిల్లెల ఆదిత్య రెడ్డి

 

for telugu news live alerts like, follow and subscribe TMedia on FacebookTwitterYouTube