వృద్ధుడికి బాసట గా కలెక్టర్

కొడుకుల నిర్లక్ష్యం పై చర్యలకు అదేశం

1
TMedia (Telugu News) :

వృద్ధుడికి బాసట గా కలెక్టర్

-కొడుకుల నిర్లక్ష్యం పై చర్యలకు అదేశం
-శరణాలయం లో తాత్కాలిక ఆశ్రయం
టీ మీడియా,మే09 ,కొత్తగూడెం: మండలం, గరీబ్ పేట గ్రామానికి చెందిన వయోవృద్ధుడు కస్ర వెంకయ్య తన కుమారులు ఇద్దరు తన గొర్రెలను అమ్ముకుని తనను ఇంటినుండి గెంటేసి, కొట్టి ఇబ్బంది పెడుతున్నారని కన్నీటి పర్యంతమైన వెంకయ్య పరిస్థితి విన్న జిల్లా కలెక్టర్ అనుదీప్ చలించి పోయారు. బాధలో ఉన్న వెంకయ్యను ఓదార్చి ఆశ్రమం కల్పిస్తామని ధైర్యంగా ఉండాలని చెప్పారు. తనను కుమారులు చూడడం లేదని ప్రజావాణిలో ఇచ్చిన ఫిర్యాదును పరిశీలించిన కలెక్టర్ తక్షణమే అతని కుమారులను పిలిపించి తండ్రి సంరక్షణ చేపట్టే విదంగా చర్యలు తీసుకోవాలని చుంచుపల్లి తహసీల్దార్ ను, ఆర్డీఓ ను ఆదేశించారు. అతని సమస్య పరిష్కారమయ్యేవరకు అతనికి ఏదేని శరణాలయంలో వసతి సౌకర్యం కల్పించాలని జిల్లా సంక్షేమ అధికారికి సూచించారు.

Also Read : చేతికొచ్చిన మొక్కజొన్న పంట అగ్నికి ఆహుతి

వృద్ధాప్యంలో ఇబ్బందులకు గురిచేస్తున్న అతని ఇద్దరు కుమారులపై వయోవృదుల సంక్షేమ చట్టం ప్రకారం చర్యలు తీసుకోవాలని ఆర్డీఓను ఆదేశించారు. జిల్లా కలెక్టర్ ఆదేశాల మేరకు వయోవృద్ధుడైన వెంకయ్యను ప్రత్యేకంగా ఆటో ఏర్పాటు చేపించి జ్యోతి అనాధ శరణాలయంలో చేర్పించినట్లు సంక్షేమ అధికారి వరలక్ష్మి చెప్పారు. అతని సంరక్షణ చర్యలను పర్యవేక్షణ చేయాలని సంక్షేమ అధికారిని జిల్లా కలెక్టర్ ఆదేశించారు. తక్షణమే వెంకయ్యను శరణాలయంలో చేర్పించి సంరక్షణ చర్యలు చేపట్టిన సంక్షేమ అధికారి వరలక్ష్మి ని, సిబ్బంది వర ప్రసాద్ ను కలెక్టర్ ప్రత్యేకంగా అభినందించారు. వృద్ధాప్యంలో ఉన్న వయోవృద్ధులను కాపాడుకోవాల్సిన బాధ్యత మనందరిపై ఉందని జిల్లా సంక్షేమ అధికారి చెప్పారు.కలెక్టర్ గారి ఆదేశాల మేరకు తక్షణమే వెంకయ్యను జ్యోతి అనాధ శరణాలయంలో చేర్పించామని, అతనికి నూతన వస్త్రాలను అందించినట్లు ఆమె చెప్పారు.

for telugu news live alerts like, follow and subscribe TMedia on FacebookTwitterYouTube