ఈవీఎం గోదాం పనులను పరిశీలించిన కలెక్టర్
టీ మీడియా, నవంబర్ 7, ఖమ్మం బ్యూరో : ఇవిఎం గోదాము మిగులు పనులను వేగవంతం చేసి వారంలోగా పూర్తి చేయాలని జిల్లా కలెక్టర్ వి.పి. గౌతమ్ అన్నారు. నూతన కలెక్టరేట్ ప్రాంగణంలో రూ. 2.78 కోట్ల వ్యయంతో నిర్మిస్తున్న ఇవిఎం గౌడౌన్ నిర్మాణ పనుల పురోగతిని కలెక్టర్ మంగళవారం తనిఖీ చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. నూతన ఇవిఎం గౌడౌన్ గ్రౌండ్, మొదటి అంతస్తుల్లో ఆర్‌సిసి ఫ్రేమ్ వర్కు, బ్రిక్, ప్లాస్టింగ్ పనులు, గ్రౌండ్ ఫ్లోర్‌లో ఫ్లోరింగ్ పనులు, వాటర్, సానిటరీ, ఆఫీస్ రూమ్, టాయిలెట్స్‌లో డోర్స్ ఫిటింగ్ పనులు పూర్తి చేయడం జరిగిందన్నారు. గ్రౌండ్, ఫ్లస్ట్‌ఫ్లోర్‌లో విద్యుత్, ఫ్లోరింగ్, కలరింగ్, స్టేయిర్‌కేస్ రైలింగ్, జి.ఐ రూఫింగ్ పనులు చేయాల్సి ఉందన్నారు. మొదటి అంతస్తులో పనులను పరిశీలించి, అన్ని కిటికీలు, వెంటిలేటర్లకు ఉంచిన ప్రదేశాలు మూసివేయాలన్నారు. భద్రతాపరంగా అన్ని చర్యలు తీసుకోవాలని అన్నారు. గోడౌన్ ముందు, వాహనాల కదలికల మేరకు స్థలం ఉంచి, ప్రహారి గోడ ఏర్పాటుకు, అప్రోచ్ రోడ్ నిర్మాణానికి చర్యలు చేపట్టాలన్నారు.
Also Read : బీఆర్ఎస్ కి ఎదురుదెబ్బ
ఈ సందర్భంగా అదనపు కలెక్టర్ డి. మధుసూదన్ నాయక్, సిపిఓ ఏ. శ్రీనివాస్, రోడ్లు, భవనాల శాఖ ఎస్ఇ శ్యామ్ ప్రసాద్, ఏఇఇ విశ్వనాథ్, కలెక్టరేట్ ఎన్నికల విభాగ సూపరింటెండెంట్ రాంబాబు, అధికారులు తదితరులు ఉన్నారు.
for telugu news live alerts like, follow and subscribe TMedia on Facebook । Twitter । YouTube