పాఠశాల తనిఖీ చేసిన కలెక్టర్

విద్యార్థులు తో ముఖాముఖి

1
TMedia (Telugu News) :

పాఠశాల తనిఖీ చేసిన కలెక్టర్
– విద్యార్థులు తో ముఖాముఖి

టీ మీడియా,సెప్టెంబర్ 6,పాల్వంచ:

పాల్వంచ మండలం
జగన్నాధపురం జడ్పిహెచ్ఎస్ పాఠశాలను ఆకస్మిక తనిఖీ చేసిన జిల్లా కలెక్టర్ అనుదీప్.
పాఠశాల పరిసరాలను క్షుణ్ణంగా పరిశీలించారు. అనంతరం విద్యార్థుల సామర్ధ్యాలను పరిశీలించారు. ఆరు, పదో తరగతి విద్యార్థులతో అర్థగంటకు పైగా సామర్ధ్యాలపై ముఖాముఖి నిర్వహించారు. విద్యార్థులు ఇంగ్లీషు మీద ఉన్న పట్టును ప్రతి విద్యార్థిని చదివించి మరి తెలుసుకున్నారు. విద్యార్థులంతా ఇంగ్లీషు పరిజ్ఞానంలో బాగా ముందున్నారని ఆయన సంతృప్తి వ్యక్తం చేశారు. విద్యార్థులకు ఆయన ఎంతో ప్రోత్సాహం కల్పించారు. ఇంకా బాగా చదువుకొని 100% ఫలితాలు సాధించాలని ఆయన సూచించారు.

Also Read : ఆర్ ఎఫ్ సి ఎల్ మరో బాధితుడు ఆత్మహత్యయత్నం

అనంతరం మధ్యాహ్న భోజన పథకం పరిశీలించారు. మెనూ ప్రకారం విద్యార్థులకు భోజనం పెడుతున్నారా లేదా అని, ఈ రోజు పెడుతున్న కూరలు బియ్యం అన్ని కూడా చూసి ఆయన సంతృప్తి వ్యక్తం చేశారు. మధ్యాహ్న భోజన నిర్వాహకులకు బిల్లులు రావటం లేదని ఆయన దృష్టి తేగా ఈ పది రోజుల్లో మొత్తం బిల్లులు వస్తాయని డీఈవో సోమశేఖర్ శర్మ తెలిపారు. పాఠశాల ముగిసిన తర్వాత, సెలవు దినాలలో కొందరు ఆకతాయిలు పాఠశాలలోకి చేరి అసాంఘిక కార్యక్రమాలకు పాల్పడుతున్నారని ఆయన దృష్టికి తీసుకుపోయారు. అనేకమార్లు దీనిపై పోలీసులు కూడా ఫిర్యాదు చేయడం జరిగిందని ఉపాధ్యాయులు తెలపగా ఆయన స్పందించి పాల్వంచ సీఐతో మాట్లాడతానని అన్నారు. వెంటనే పంచాయతీ నిధులతో నైట్ వాచ్మన్ ను ఏర్పాటు చేయాల్సిందిగా సర్పంచ్ అనితకు ఆదేశాలు జారీ చేశారు.

పాఠశాలలో విద్యార్థుల సంఖ్య హాజరు శాతం బాగా పెంచాలని, క్రమం తప్పక విద్యార్థులు ప్రతిరోజు పాఠశాలకు వచ్చే విధంగా చర్యలు తీసుకోవాలని ఆయన ఆదేశాలు జారీ చేశారు. డీఈఓ సోమశేఖర శర్మ, జెడ్పిటిసి బరపాటి వాసుదేవరావు, తాసిల్దారు రంగా ప్రసాద్, ఎంపీడీవో, ఎం పి ఓ, సర్పంచ్ అనిత, ఉపసర్పంచ్ వీరభద్రం, పాఠశాల ప్రధానోపాధ్యాయులు బి ప్రకాష్ రావు తదితరులు పాల్గొన్నారు.

for telugu news live alerts like, follow and subscribe TMedia on FacebookTwitterYouTube