ముంపు ప్రాంతాలను సందర్శించిన కలెక్టర్ , ఎస్పీ

బాధితులు కు బరోసా

1
TMedia (Telugu News) :

ముంపు ప్రాంతాలను సందర్శించిన కలెక్టర్ , ఎస్పీ

-బాధితులు కు బరోసా

టి మీడియా,జూలై22,భద్రాచలం/బూర్గంపాడు/అశ్వాపురం :మండలాల్లో వరద ముంపుకు గురైన ప్రాంతాలను జిల్లా కలెక్టర్ అనుదీప్ దురిశెట్టి,ఎస్పీ డాక్టర్ వినీత్.జి ఐపిఎస్ లు సందర్శించారు. భద్రాచలం పట్టణంలోని రామాలయం వీధి (చప్టా కాలనీ)లో వరద ముంపు బాధితులను కలిసి వారి సమస్యలను అడిగి తెలుసుకున్నారు. అనంతరం గోదావరి బ్యాక్ వాటర్ వలన వరదకు గురైన కొత్త కాలనీలో ప్రస్తుత పరిస్థితిని అక్కడి స్థానికులను అడిగి తెలుసుకున్నారు. అక్కడి నుండి బూర్గంపాడు మండలం రెడ్డిపాలెం గ్రామంలో వరద ముంపు బాధితుల కొరకు ఏర్పాటు చేసిన పునరావాస కేంద్రాన్ని పరిశీలించారు. ఆశ్వాపురం మండలం నెల్లిపాక బంజర గ్రామ ప్రజలతో మాట్లాడి, వారి సమస్యలను అడిగి తెలుసుకున్నారు.

 

Also Read : ప్రభుత్వాల పథకాలపై అవగాహన సదస్సు

 

అధికారులను వరద ముంపు బాధితుల గణన ప్రక్రియ గురించి అడిగి తెలుసుకున్నారు. ఈ సందర్భంగా కలెక్టర్ అనుదీప్ మాట్లాడుతూ వరద ముంపు బాధితుల గణన ప్రక్రియను ఒక ప్రణాళిక ప్రకారం జాబితా తయారు చేసి బాధితులందరికీ ప్రభుత్వ సహాయం అందేలా చర్యలు చేపడుతున్నామని, ప్రతి ఒక్కరూ ఈ ప్రక్రియ సక్రమంగా జరిగేలా అధికారులకు సహకరించాలని కోరారు. అనంతరం ఎస్పీ డా.వినీత్.జి మాట్లాడుతూ ముంపునకు గురైన ప్రజలు ఎవ్వరూ అధైర్య పడవద్దని, అన్ని శాఖల అధికారుల సమన్వయంతో జిల్లా పోలీసులు ఎల్లప్పుడూ ప్రజలకు అందుబాటులో ఉంటారని తెలిపారు. ఏవైనా సమస్యలు తలెత్తితే వెంటనే డయల్ 100 కు ఫోన్ చేసి పోలీసు వారి సహాయం పొందాలని విజ్ఞప్తి చేశారు.

for telugu news live alerts like, follow and subscribe TMedia on FacebookTwitterYouTube