వెంకటాపురం తాసిల్దార్ కార్యాలయం సందర్శించిన భద్రాద్రి కొత్తగూడెం జిల్లా అదనపు కలెక్టర్ వెంకటేశ్వర్లు

0
TMedia (Telugu News) :

టి మీడియా,డిసెంబర్ 2 వెంకటాపురం

ములుగు జిల్లా వెంకటాపురం మండలంలో ఓటర్ల నమోదు సవరణ ప్రక్రియ విధులను వేగవంతంగా పూర్తిచేయాలని భద్రాద్రి కొత్తగూడెం జిల్లా అదనపు కలెక్టర్, ఎలక్టోరల్ రిజిస్ట్రేషన్ ఆఫీసర్ కె వెంకటేశ్వర్లు వెంకటాపురం మండల అధికారులను ఆదేశించారు . మండల కేంద్రంలోని రెవెన్యూ , మండల పరిషత్ కార్యాలయాలలో రికార్డులను పరిశీలించి నూతన ఓటర్ల గా నమోదు దరఖాస్తులను ధ్రువీకరించారు. అనంతరం ఉమ్మడి ఖమ్మం జిల్లా స్థానిక సంస్థల ఎన్నికలలో ప్రాదేశిక నియోజకవర్గ సభ్యులందరూ పోలింగ్లో పాల్గొనే విధంగా అవగాహన కల్పించాలని ఆదేశించారు .119- భద్రాచలం అసెంబ్లీ నియోజకవర్గం పరిధిలో ఉన్న మండలంలో స్థానిక సంస్థల శాసన మండలి ఎన్నికలు , ఓటర్ల నమోదు ప్రక్రియలను ఆయన పరిశీలించారు . ఈ కార్యక్రమంలో తాసిల్దార్ అంటి నాగరాజు , మండల పరిషత్ అభివృద్ధి అధికారి ఫణి చంద్ర , రెవిన్యూ ఇన్స్పెక్టర్ వెంకటేశ్వర్లు , సీనియర్ అసిస్టెంట్ సమ్మయ్య , కార్యాలయం సిబ్బంది తదితరులు పాల్గొన్నారు .

Bhadradri Kottagudem District Additional Collector Venkateshwarlu visits Venkatapuram Tasildar’s office.
for telugu news live alerts like, follow and subscribe TMedia on FacebookTwitterYouTube