వైద్యాధికారులు నిర్దేశించిన లక్ష్యాలను పూర్తి చేయాల

-వీడియో కాన్ఫరెన్స్ లో కలెక్టర్ వి.పి. గౌతమ్

1
TMedia (Telugu News) :

వైద్యాధికారులు నిర్దేశించిన లక్ష్యాలను పూర్తి చేయాల

-వీడియో కాన్ఫరెన్స్ లో కలెక్టర్ వి.పి. గౌతమ్

టీ మీడియా,అక్టోబర్ 28,ఖమ్మం : జిల్లాలోని ప్రభుత్వ ఆరోగ్య కేంద్రాల్లో పనిచేస్తున్న వైద్యాధికారులు నిర్దేశించిన లక్ష్యాలను అన్ని పారామీటర్స్ లో పూర్తి చేయాలని జిల్లా కలెక్టర్ వి.పి. గౌతమ్ అన్నారు. గురువారం కలెక్టరేట్ లోని వీడియో కాన్ఫరెన్స్ హాల్ నుండి ప్రాథమిక ఆరోగ్య కేంద్రాల వైద్యాధికారులతో ప్రాథమిక ఆరోగ్య కేంద్రాల వారీగా లక్ష్యాలను కలెక్టర్ సమీక్షించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, ప్రాథమిక ఆరోగ్య కేంద్రాలు వారి పరిధిలోని ప్రజలకు వైద్య, ఆరోగ్య సంబంధ సేవలు అందించాలని తెలిపారు.

ప్రభుత్వ ఆస్పత్రుల్లో ప్రసవాలను పెంచాలని ఆయన అన్నారు. కొన్ని ప్రాథమిక ఆరోగ్య కేంద్రాల్లో జీరో ప్రసవాలు ఉన్నాయని, పనితీరు మెరుగుపడాలని, లేకుంటే చర్యలు తప్పవని ఆయన తెలిపారు. ఎఎన్‌ఎం, ఆశయాలు తమ పరిధిలో గర్భిణుల వివరాలను నమోదు చేయడంతో పాటు ప్రతి నెల క్రమం తప్పకుండా ఆసుపత్రికి వచ్చి పరీక్షలు చేసుకునేలా అవగాహన కల్పించాలన్నారు. ప్రతి నెల ప్రతి పిహెచ్ సి లో 15 కు మించి ఇడిడి కేసులు వుంటాయని, ప్రతి కేసు ఆయా పిహెచ్ సి కి వచ్చేలా అన్ని చర్యలు తీసుకోవాలని అన్నారు. ప్రతి పిహెచ్ సి పరిధిలో ఎన్ని కేసులు ప్రభుత్వ, ఎన్ని కేసులు ప్రయివేటు ఆసుపత్రులకు వెళుతున్నాయో నివేదిక సమర్పించాలని ఆయన అన్నారు.

Also Read : అభివృద్ది కి టిఆర్ఎస్ అభ్యర్థిని గెలిపించండి

జిల్లాలో 11 ప్రాథమిక ఆరోగ్య కేంద్రాల మరమ్మత్తులకు రూ. 2.29 కోట్లు, బనిగండ్లపాడు ప్రాథమిక ఆరోగ్య కేంద్ర పునర్ నిర్మాణానికి రూ. 1.5 కోట్లు మంజూరు అయినట్లు ఆయన అన్నారు. ఇట్టి మొత్తంతో ఆసుపత్రికి, పేషంట్లకు ఉపయోగపడే పనులు చేపట్టాలని, ఈ పనుల పూర్తితో కేంద్రంలో స్పష్టమైన మార్పు రావాలని అన్నారు. డ్రై డే కార్యాచరణ చేసి, డెంగ్యూ కేసులు ఈ సంవత్సరం చాలా వరకు తగ్గించామని ఆయన తెలిపారు. టైఫాయిడ్ కేసులపై దృష్టి పెట్టాలని, ఇప్పటికే వసతి గృహ భోజన తయారు సిబ్బందికి పరీక్షలు చేపట్టినట్లు, అదే విధంగా మధ్యాహ్న భోజన తయారు సిబ్బందికి, పాణిపూరి, మిర్చి బండ్లు, డాబా ల్లోని ఆహార తయారీ వర్కర్లకు టైఫాయిడ్ పరీక్షలు నిర్వహించాలని, పాజిటివ్ కేసులు గుర్తించిన వాటిని చికిత్స అందించాలని ఆయన తెలిపారు. టిబి గుర్తింపును స్పుటం సాంపిల్ సేకరణ చేయాలని, గుర్తించిన ప్రతి కేసును వైద్యాధికారులు పర్యవేక్షణ చేయాలని ఆయన అన్నారు. టిబి రోగుల దత్తత కార్యక్రమంపై విస్తృత స్థాయిలో అవగాహన కల్పించి, వారికి పౌష్టికాహారం అందించడానికి అయ్యే ఖర్చును భరించే దాతలను గుర్తించాలని ఆయన తెలిపారు. టీకాలు వంద శాతం లక్ష్యం సాధించాలని, దీనికి ప్రణాళికాబద్ధంగా కార్యాచరణ చేయాలని కలెక్టర్ అన్నారు. ఈ వీడియో కాన్ఫరెన్స్ లో జిల్లా వైద్య ఆరోగ్యాధికారిని డా. బి. మాలతి, జిల్లా ప్రధాన ఆసుపత్రి సూపరింటెండెంట్ డా. వెంకటేశ్వర్లు, ఎన్సిడి ప్రాజెక్ట్ అధికారిణి డా. కోటిరత్నం, డిటీసీఓ డా. సుబ్బారావు, జిల్లా ఎయిడ్స్ అండ్ లెప్రసీ నియంత్రణ అధికారిణి డా. ప్రావీన, డిఐఓ డా. ప్రమీల, ఎన్హెచ్ఎం నీలోహణ, వైద్యాధికారులు తదితరులు పాల్గొన్నారు.

for telugu news live alerts like, follow and subscribe TMedia on FacebookTwitterYouTube