కంటి వెలుగు శిబిరాలను తనిఖీ చేసిన కలెక్టర్

-సద్వినియోగం చేసుకోవాలని పిలుపు

0
TMedia (Telugu News) :

కంటి వెలుగు శిబిరాలను తనిఖీ చేసిన కలెక్టర్

-సద్వినియోగం చేసుకోవాలని పిలుపు

టీ మీడియా,జనవరి 20,ఖమ్మం : రెండో విడత కంటి వెలుగు కార్యక్రమాన్ని ప్రజలందరూ సద్వినియోగం చేసుకోవాలని జిల్లా కలెక్టర్ వి.పి. గౌతమ్ పిలుపునిచ్చారు. శుక్రవారం ఖమ్మం మునిసిపల్ కమీషనర్ ఆదర్శ్ సురభి తో కలిసి నగరంలోని 12వ డివిజన్ పోలీస్ కాలనీలోని సిటీ సెంట్రల్ కన్వెన్షన్ సెంటర్, 9 డివిజన్ రోటరీనగర్ లోని శ్రీశ్రీశ్రీ రాజరాజేశ్వరి అమ్మవారి కళ్యాణ మండపం లలో ఏర్పాటు చేసినచేశారు. ఆహ్వాన పత్రాలు పంపిణీని అడిగి తెలుసుకున్నారు.

కేంద్ర పరిధిలో ఎంత మందికి పరీక్షలు చేయనుంది, ఎన్ని కళ్ళద్దాలు సిద్ధంగా ఉంది అడిగి తెలుసుకున్నారు. రిజిస్ట్రేషన్ మొదలు పరీక్ష పూర్తయ్యే వరకు చేసిన ఏర్పాట్లను పరిశీలించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, ప్రతి ఒక్కరు కంటి పరీక్షలు నిర్వహించుకుని కంటి అద్దాలు ఉచితంగా పొందాలని అన్నారు. ప్రజాప్రతినిధులు, అధికారులు సమన్వయంతో ప్రజలకు కార్యక్రమంపై అవగాహన కల్పించాలని అన్నారు. పరీక్ష అనంతరం ప్రజలకు వారి కంటి సమస్య గురించి వివరంగా తెలియజేయాలని, రీడింగ్ గ్లాస్ లు అవసరమైన వారికి వెంటనే రీడింగ్ గ్లాస్ లు అందజేస్తారని అన్నారు. ప్రిస్కిప్షన్ గ్లాస్ లు వారం, పది రోజుల్లో వారి వారి ఇండ్లకు చేరేలా ఏర్పాట్లు చేసినట్లు ఆయన తెలిపారు. వివరాల నమోదు ఎటువంటి పొరపాట్లు లేకుండా చేపట్టాలని ఆయన తెలిపారు. ఉదయం, మధ్యాహ్నం పూటలుగా ప్రజల సమీకరణ కు చర్యలు తీసుకోవాలని, క్యూ పద్ధతి చేపట్టి, కేంద్రం వద్ద నిర్వహణ సజావుగా చేపట్టాలన్నారు.

Also Read : రాజీనామా చేసే ప్ర‌స‌క్తే లేదు: బ్రిజ్ భూష‌ణ్‌

దృష్టి లోపంతో ఎవరూ ఇబ్బందులు పడకుండా ఉండడానికి రాష్ట్ర వ్యాప్తంగా ప్రభుత్వం కంటి వెలుగు కార్యక్రమానికి స్వీకారం చుట్టిందన్నారు. 18 సంవత్సరాలు నిండిన ప్రతి ఒక్కరికీ నేత్ర పరీక్షలు నిర్వహించి, అవసరమైన వారికి కళ్ళాద్దాలను పంపిణీ చేసేలా విస్తృత చర్యలు చేపట్టినట్లు ఆయన తెలిపారు. కంటి వెలుగు కార్యక్రమం నిర్వహణతో ప్రభుత్వ ఆసుపత్రుల్లో ప్రజలకు అందించే సేవల్లో ఎలాంటి ఆటంకాలు కలగకుండా చూడాలన్నారు. కలెక్టర్ తనిఖీల సందర్భంగా కార్పొరేటర్ చిరుమామిళ్ల లక్ష్మి, జిల్లా వైద్య, ఆరోగ్య అధికారిణి డా. బి. మాలతి, జిల్లా ఉప వైద్య, ఆరోగ్య అధికారి డా. రాంబాబు, వైద్యాధికారులు డా. రీతూ చౌదరి, డా. బాలకృష్ణ,

for telugu news live alerts like, follow and subscribe TMedia on FacebookTwitterYouTube