కలెక్టర్ కార్యాలయ వద్ద జరిగే ధర్నాను జయప్రదం చేయండి.

0
TMedia (Telugu News) :

టీ మీడియా,డిసెంబర్ 23,కరకగూడెం:

కేజీబీవీ నాన్-టీచింగ్ వర్కర్స్ సమస్యలను పరిష్కరించాలని 28 న కొత్తగూడెం కలెక్టర్ కార్యాలయ వద్ద జరిగే ధర్నాను జయప్రదం చేయాలని ఐ.ఎఫ్.టి.యు జిల్లా ఉపాధ్యక్షులు ఆర్. మధుసూదన్ రెడ్డి పిలునిచ్చారు.
గురువారం కరకగూడెం మండల కేజీబీవీ నాన్-టీచింగ్ వర్కర్స్ సమావేశంలో ఆయన పాల్గొని మాట్లాడారు.
రాష్ట్ర ప్రభుత్వం 11.6.2020 తేదీన జీవో నెంబర్ 60 ని జారీ చేసిందని, ఈ జీవో ప్రకారం 1వ కేటగిరీకి15,600, రెండవ కేటగిరీకి19,500, మూడవ కేటగిరి కి 22,750 రూపాయలు దానిపైన రాష్ట్ర ప్రభుత్వం ప్రకటించిన 30% ఫిట్మెంట్ కలిపి వేతనాలు చెల్లించవలసి ఉండగా దానిని విస్మరించి ఇప్పుడు ఇస్తున్న అరకొర జీతాల పైన 30% ఫిట్మెంట్ అమలు చేయడం దారుణమన్నారు.

అవి కూడా నేటికీ చెల్లించలేదని విమర్శించారు. అంతేకాకుండా పిల్లల సంఖ్య కు సరిపడా వర్కర్లను నియమించకుండా ఉన్న వారి తోటే వెట్టిచాకిరీ చేయిస్తున్నారు అని ఆరోపించారు. ఇప్పటికైనా ప్రభుత్వ అధికారులు, ప్రభుత్వం స్పందించి పిల్లల సంఖ్య కు సరిపడా వర్కర్లను నియమించాలని, వర్కర్ల పని భారం తగ్గించాలని, జీవో నెంబర్ 60 ప్రకారం వేతనాలు చెల్లించాలని డిమాండ్ చేశారు.
ఈ సమస్యలు పరిష్కరించాలని డిమాండ్ చేస్తూ ఈ నెల 28 న కొత్తగూడెం కలెక్టర్ ఆఫీస్ ముందు జరిగే ధర్నాలో కేజీబీవీ నాన్-టీచింగ్ వర్కర్స్ అధిక సంఖ్యలో పాల్గొని విజయవంతం చేయాలని కోరారు.
ఈ సమావేశంలో పార్వతి, రజిత, సుజాత, తదితరులు పాల్గొన్నారు.

IFTU district vice-president R.S Madhusudhan Reddy called.
for telugu news live alerts like, follow and subscribe TMedia on FacebookTwitterYouTube