కలెక్టర్ విస్తృత పర్యటన

పునరావాస కేంద్రాల సందర్శన

1
TMedia (Telugu News) :

కలెక్టర్ విస్తృత పర్యటన
– పునరావాస కేంద్రాల సందర్శన
టి మీడియా, జూలై18,సారపక: భద్రాద్రి కొత్తగూడెం జిల్లా లోవరద ముంపుకు గురైన బూర్గంపాడు మండలంలో ఖమ్మం జిల్లా కలెక్టర్ వి.పి. గౌతమ్ ఆదివారం సాయంత్రం పర్యటించారు. కలెక్టర్ మోరంపల్లి బంజర గ్రామంలోని స్టెల్లా మేరీస్ ఇంగ్లీష్ మీడియం స్కూల్ లో ఏర్పాటు చేసిన పునరావాస కేంద్రాన్ని తనిఖీ చేశారు. కేంద్రంలో ఎంత మంది ఆశ్రయం పొందుతుంది అడిగి తెలుసుకున్నారు. కేంద్రంలో 280 కుటుంబాలు ఆశ్రయం పొందుతున్నట్లు, 20 గదుల్లో వీరికి ఆశ్రయం కల్పించినట్లు అధికారులు తెలిపారు. 5 రోజులుగా కేంద్రం ఉంటున్నట్లు, వసతి, భోజనం బాగుగా ఉన్నట్లు బాధితులు తెలిపారు. బాధితుల గదులను, భోజనాన్ని కలెక్టర్ పరిశీలించారు. అనంతరం గ్రామంలో జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో ఏర్పాటు చేసిన పునరావాస కేంద్రాన్ని కలెక్టర్ తనిఖీ చేశారు. కేంద్రంలో 300 కుటుంబాలు ఆశ్రయం పొందుతున్నట్లు, వీరికి వసతి, టాయిలెట్ల సౌకర్యం, భోజనం ఏర్పాట్లు చేస్తున్నట్లు ఆయన అన్నారు. పునరావాస కేంద్రాలకు వచ్చిన వారు వర్షాలు లేవని తిరిగి ఇండ్లకు వెళ్లవద్దని, ముప్పు ఇంకా పోలేదని, వెళ్ళమని అధికారులు సూచించే వరకు ఇక్కడే ఉండాలని అన్నారు. పునరావాస కేంద్రాలకు వచ్చిన వారి ఇండ్ల వద్ద పోలీస్ పెట్రోలింగ్ చేపట్టి, భద్రతకు చర్యలు చేపడతామని ఆయన తెలిపారు. కేంద్రాలకు వచ్చిన వారి వివరాలు నమోదు చేయాలని, ప్రభుత్వం బాధిత కుటుంబానికి రూ. 10 వేల చొప్పున తక్షణ ఆర్థిక సహాయం, వచ్చే రెండు నెలలు 20 కిలోల చొప్పున ఉచిత బియ్యం అందజేయడం జరుగుతుందని అన్నారు.

 

Also Read : మాజీ ఎంపీటీసీకి పరామర్శ

 

బాధిత కుటుంబాలు కుదురుకొని, సాధారణ పరిస్థితులు వచ్చేవరకు ప్రభుత్వం చేయూత నిస్తుందని కలెక్టర్ అన్నారు. అనంతరం కలెక్టర్ బూర్గంపాడు మండల కేంద్రంలో పర్యటించి, వరద పరిస్థితి క్షేత్ర స్థాయిలో పరిశీలిస్తూ, గ్రామస్థులను వరద గురించి అడిగి తెలుసుకున్నారు. లోతట్టు ప్రాంతాల్లోని ఇండ్లకు వెళ్లి, వరద సమయంలో వారు ఎక్కడ ఆశ్రయం పొందింది అడిగి తెలుసుకున్నారు. భారీ వర్షాల సమయంలో గోదావరి వరద ఎలా వస్తుంది, ఏ ఏ ప్రదేశాల్లో దాని ప్రభావం తీవ్రంగా ఉంది, ఏ ఏ జాగ్రత్తలు తీసుకోవాల్సింది ప్రజాప్రతినిధులు, గ్రామస్థులను అడిగి తెలుసుకున్నారు. విద్యుత్ సరఫరా మెల్లి మెల్లిగా పునరుద్ధరణ చేస్తున్నట్లు, కొన్ని ప్రాంతాల్లో విద్యుత్ సరఫరా చేసినట్లు ఆయన అన్నారు. విద్యుత్ సరఫరా తో ఆస్తి, ప్రాణ నష్టం కలగకుండా జాగ్రత్తలు చేపట్టాలన్నారు. సామాజిక ఆరోగ్య కేంద్రాన్ని సందర్శించి, వరద పరిస్థితిని పరిశీలించారు. శాశ్వత పరిష్కారానికి ప్రభుత్వం ప్రణాళికాబద్ధంగా చర్యలు చేపట్టనున్నట్లు కలెక్టర్ తెలిపారు.

 

Also Read : సి పి యం ఆధ్వర్యంలో రాస్తారోకో

 

కలెక్టర్ పర్యటన సందర్భంలో ఖమ్మం ఆర్డీవో రవీంద్రనాథ్, హుజూర్ నగర్ ఆర్డీవో/ ప్రత్యేక అధికారి వెంకా రెడ్డి, మిషన్ భగీరథ ఇఇ తిరుమలేష్, ఎంపిడివో వివేక్ రావు, తహసీల్దార్ భగవాన్, జెడ్పిటిసి శ్రీలత, సర్పంచ్ దివ్య, అధికారులు, తదితరులు ఉన్నారు.

for telugu news live alerts like, follow and subscribe TMedia on FacebookTwitterYouTube