బతుకమ్మ పండుగ ఘనంగా నిర్వహించేలా ఏర్పాట్లు -కలెక్టర్ వి.పి. గౌతమ్

బతుకమ్మ పండుగ ఘనంగా నిర్వహించేలా ఏర్పాట్లు -కలెక్టర్ వి.పి. గౌతమ్

0
TMedia (Telugu News) :

బతుకమ్మ పండుగ ఘనంగా నిర్వహించేలా ఏర్పాట్లు -కలెక్టర్ వి.పి. గౌతమ్

టీ మీడియా,సెప్టెంబర్.23, ఖమ్మం: 25 నుండి ఎంగిలిపూల బతుకమ్మ తో ప్రారంభమై, అక్టోబర్ 3న జరుగు సద్దుల బతుకమ్మ వరకు పండుగను ఘనంగా నిర్వహించేలా ఏర్పాట్లు ఉండాలని జిల్లా కలెక్టర్ వి.పి. గౌతమ్ అధికారులను ఆదేశించారు. శుక్రవారం కలెక్టరేట్ లోని ప్రజ్ఞ సమావేశ మందిరంలో బతుకమ్మ పండుగ ఏర్పాట్లపై కలెక్టర్ సమావేశాన్ని నిర్వహించి అధికారులకు ఏర్పాట్లపై దిశానిర్దేశం చేశారు. ఈ సందర్బంగా ఆయన మాట్లాడుతూ, తెలంగాణ సంస్కృతి, సాంప్రదాయాలకు ప్రతీకగా నిలిచి ఎంగిలిపూల బతుకమ్మతో ప్రారంభమై, సద్దుల బుతుకమ్మ వరకు తొమ్మిది రోజుల పాటు నిర్వహించనున్న బతుకమ్మ పండుగ ఏర్పాట్లు జిల్లాలో ఎటువంటి లోటుపాట్లు లేకుండా ఘనంగా నిర్వహించాలని అన్నారు. గత రెండు సంవత్సరాలుగా కోవిడ్ కారణంగా వేడుకలు చేపట్టలేదని, ఈ సారి పెద్ద ఎత్తున చేపట్టాలని అన్నారు. ఒక్కో రోజు ఒక్కో శాఖ క్రియాశీలకంగా వేడుకలు నిర్వహించాలన్నారు. రెస్టారెంట్లతో తెలంగాణా వంటకాలకు సంబంధించి ఫుడ్ ఫెస్టివల్ ఏర్పాటుకు చర్యలు చేపట్టాలన్నారు.

ALSO READ:బతుకమ్మ చీరల పంపిణీలో కౌన్సిలర్ భర్తల పెత్తనం

 

మీడియన్స్, ప్రధాన కూడళ్లలో బతుకమ్మకు సంబంధించి సుందరీకరణ చేయాలన్నారు. జిల్లా ప్రధాన ఆసుపత్రి, సామాజిక ఆరోగ్య కేంద్రాలు, ప్రయివేటు ఆసుపత్రుల్లో ప్రసవాలు జరిగి అమ్మాయి పుట్టినవారికి చీరెలు అందించి సత్కరించాలని, ఆడపిల్లలను ప్రోత్సహించాలని, ఒక పండుగలా వేడుక చేయాలని ఆయన అన్నారు. ఆడపిల్లల సంరక్షణపై దృష్టి పెట్టాలని అన్నారు. ఫోటోగ్రఫీ, పెయింటింగ్ లలో పోటీలు నిర్వహించాలని ఆయన తెలిపారు. నిమజ్జనం చేసే ప్రాంతాలలో లైటింగ్, సీసీకెమెరాలను ఏర్పాటుచేయాలన్నారు. లోతు ఎక్కువగా వున్న ప్రదేశాల్లో గజ ఈతగాళ్లను అందుబాటులో ఉంచాలని అన్నారు. సానిటేషన్ ఏర్పాట్లు సక్రమంగా ఉండేలా చూడాలని ఆధికారులను ఆదేశించారు. బతుకమ్మ చీరెల పంపిణీ ఈ నెల 25 లోగా పూర్తయ్యేలా చర్యలు చేపట్టాలన్నారు. రేషన్ కార్డులోని 18 సంవత్సరాలు నిండిన ప్రతి ఒక్క మహిళకు చీరెలు అందాలని ఆయన అన్నారు.

also read :చంద్రబాబు నాన్‌ లోకల్‌ : సీఎం జగన్‌

సమావేశంలో పాల్గొన్న పోలీస్ కమీషనర్ విష్ణు ఎస్. వారియర్ మాట్లాడుతూ, పెద్ద సంఖ్యలో మహిళలు ఉన్నచోట లైటింగ్ ఏర్పాటు చేయాలని అన్నారు. విలువైన వస్తువులు, ఈవ్ టీజింగ్ జరగకుండా భద్రతా చర్యలు చేపట్టాలన్నారు. ఈ సమావేశంలో అదనపు కలెక్టర్లు స్నేహాలత మొగిలి, ఎన్. మధుసూదన్, మునిసిపల్ కమీషనర్ ఆదర్శ్ సురభి, సిఇ ఇర్రిగేషన్ శంకర్ నాయక్, డిఆర్డీవో విద్యాచందన, జిల్లా వ్యవసాయ అధికారిణి విజయనిర్మల, జిల్లా ఉద్యానవన అధికారిణి అనసూయ, జిల్లా పంచాయతీ అధికారి హరిప్రసాద్, జిల్లా సంక్షేమ అధికారిణి సంధ్యారాణి, జిల్లా గిరిజన సంక్షేమ అధికారి కృష్ణా నాయక్, అధికారులు తదితరులు పాల్గొన్నారు.

for telugu news live alerts like, follow and subscribe TMedia on FacebookTwitterYouTube