
-సిలింగ్ భూమి పరిసలన
టీ మీడియా,నవంబరు, 17, ఖమ్మం:
ఆక్రమ వెంచర్లపై చట్టపరంగా కఠిన చర్యలు తీసుకోవాలని జిల్లా కలెక్టర్ వి.పి. గౌతమ్ అధికారులను ఆదేశించారు. బుధవారం కూసుమంచి మండల పర్యటన సందర్భంగా జీళ్ళచెర్వులో ఏర్పాటు చేసిన వెంచర్లను కలెక్టర్ పరిశీలించి వెంచర్ల గురించి ఎం.పి.డి.ఓ, తహశీల్దారుతోతెలుసుకున్నారు. కలెక్టర్ సందర్శించిన వెంచర్ సిలింగ్ కేసులో ని భూమి కావడం గమనార్హం..అవెంచర్ అంత కలెక్టర్ కలియ తిరిగారు..ఈ అక్రమ వెంచర్ ల గురించి టీ మీడియా, వరుస కథనాలను ప్రచురించింది..ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూకూసుమంచి మండలంలో అనుమతులు లేకుండా అక్రమంగా వెలుస్తున్న వెంచర్లపై సత్వరమే చర్యలు తీసుకోవాలని, నోటీసులు జారీ చేసినప్పటికి స్పందించని వెంచర్లను తొలగించి నివేదిక సమర్పించాలని మండల అధికారులను కలెక్టర్ ఆదేశించారు. రిజిస్ట్రేషన్ చేసుకోకుండా అక్రమంగా ఏర్పాటు చేసిన వెంచర్లపై గురువారం సాయంత్రంలోగా చర్యలు తీసుకోవాలని, స్పందించని వెంచర్లకు సంబంధించిన ప్రహరీలను ముఖ ద్వారాలను తొలగించాలని కలెక్టర్ మండల అధికారులను ఆదేశించారు.ఖమ్మం రెవెన్యూ డివిజనల్ అధికారి రవీంద్రనాథ్, కూసుమంచి తహశీల్దారు శీరీష, ఎం.పి.టి.ఓ కరుణాకర్ రెడ్డి, గ్రామ కార్యదర్శి తదితరులు పాల్గొన్నారు.
for telugu news live alerts like, follow and subscribe TMedia on Facebook । Twitter । YouTube