కమిషనర్ v/s చైర్ పర్సన్

-కాలింగ్ బెల్ విసిరి వేత

1
TMedia (Telugu News) :

కమిషనర్ v/s చైర్ పర్సన్ -కాలింగ్ బెల్ విసిరి వేత
టి మీడియా,జూన్ 9,బెల్లంపల్లి:మంచిర్యాల జిల్లా బెల్లంపల్లి మునిసిపాలిటీలో ఇంటి నెంబర్ల జారీపై మున్సిపల్ కమిషనర్, మున్సిపల్ చైర్ పర్సన్‌ల మధ్య కౌన్సిలర్ల సమక్షంలోనే తీవ్ర వాగ్వాదం జరిగినట్లు తెలుస్తోంది.
ఇంటి నెంబర్లు ఎందుకు జారీచేస్తున్నారంటూ చెబుతే వినరా అంటూ మున్సిపల్ కమీషనర్ జంపాల రజితపైకి చైర్‌పర్సన్ జక్కుల శ్వేత కాలింగ్ బెల్ విసిరిన ఘటన మున్సిపల్ చైర్ పర్సన్ చాంబర్లో చోటుచేసుకుంది. కమిషనర్‌కు కొత్త ఇంటి నెంబర్లు జారీ చేయాలని ఈ విషయంలో ప్రజలు ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని కొందరు కౌన్సిలర్లు కమిషనర్‌కు కొద్ది రోజుల క్రితం దరఖాస్తు చేసుకున్నట్లు తెలుస్తోంది. సెలవుపై వెళ్లి వచ్చిన కమిషనర్ రజిత దరఖాస్తులు పెట్టుకున్న వారికి ఇంటి నెంబర్లు జారీచేయాలని రెండురోజుల క్రితం సంబంధిత అధికారులను ఆదేశించినట్లు తెలిసింది. విషయం తెలుసుకున్న చైర్ పర్సన్ తన చాంబర్‌లోకి కమీషనర్‌ను పిలిపించారు.

 

Also Read : ఉగ్రనిధుల కేసులో తమిళనాడులో ఎన్‌ఐఏ సోదాలు

 

ఎందుకు ఇంటి నెంబర్లు జారీ చేస్తున్నారంటూ కమిషనర్‌ను ప్రశ్నించారు. కౌన్సిలర్లు అందరు కొత్త ఇంటి నెంబర్లు ఇవ్వాలని దరఖాస్తులు పెట్టుకున్నారని అయిన ఇంటి నెంబర్లు ఇస్తే తప్పేంటని చైర్ పర్సన్‌తో అన్నట్లు తెలుస్తోంది. దీనితో ఆగ్రహానికి గురైన మున్సిపల్ చైర్ పర్సన్ జక్కుల శ్వేత తన టేబుల్‌పై ఉన్న కాలింగ్ బెల్‌ను కమిషనర్ రజితపైకి విసిరి వేసినట్లు తెలుస్తోంది. దీనితో కన్నీటి పర్యంతమైన మున్సిపల్ కమిషనర్ అక్కడి నుండి వెళ్లిపోయినట్లు కార్యాలయంలో చర్చ జరుగుతోంది. ఈ ఘటన పట్టణంలో చర్చనీయాంశంగా మారింది. ఈ ఘటన జరిగిన సమయంలో కౌన్సిలర్లు నీలికృష్ణ, కొక్కెర చంద్రశేఖర్, టీఆర్‌ఎస్ నాయకులు జక్కుల శ్రీధర్, బడికల రమేష్, చిట్యాల మధు, నెల్లి రమేష్ తదతరులు ఉన్నట్లు తెలుస్తోంది.

for telugu news live alerts like, follow and subscribe TMedia on FacebookTwitterYouTube