స‌నాత‌న ధ‌ర్మంపై వ్యాఖ్య‌ల‌ను వ‌క్రీక‌రించారు

త‌మిళ‌నాడు మంత్రి ఉద‌య‌నిధి స్టాలిన్‌

0
TMedia (Telugu News) :

స‌నాత‌న ధ‌ర్మంపై వ్యాఖ్య‌ల‌ను వ‌క్రీక‌రించారు

– త‌మిళ‌నాడు మంత్రి ఉద‌య‌నిధి స్టాలిన్‌

టీ మీడియా, డిసెంబర్ 4, చెన్నై : స‌నాత‌న ధ‌ర్మంపై త‌న వ్యాఖ్య‌ల‌ను బీజేపీ వ‌క్రీక‌రించింద‌ని డీఎంకే నేత‌, త‌మిళ‌నాడు మంత్రి ఉద‌య‌నిధి స్టాలిన్ ఆరోపించారు. క‌రూర్ జిల్లాలో జ‌రిగిన యువ కార్య‌క‌ర్త‌ల భేటీలో ఉద‌య‌నిధి మాట్లాడుతూ.. గ‌తంలో స‌నాత‌న ధ‌ర్మంపై తాను చేసిన వ్యాఖ్య‌ల‌ను ప్ర‌స్తావించారు. మ‌ధ్య‌ప్ర‌దేశ్ ఎన్నిక‌ల ప్ర‌చారంలో ప్ర‌ధాని నరేంద్ర మోదీ గ‌తంలో తాను స‌నాత‌న ధ‌ర్మంపై చేసిన వ్యాఖ్య‌ల‌ను త‌ప్పుగా చిత్రీక‌రించార‌ని ఆరోపించారు. తాను ఊచ‌కోత‌కు పిలుపు ఇచ్చాన‌ని, తాను అన‌ని మాట‌ల‌ను ప్ర‌ధాని త‌న‌కు ఆపాదించార‌ని స్టాలిన్ ఆరోపించారు. తాను ఓ స‌ద‌స్సుకు హాజ‌రై కొద్ది నిమిషాలు మాట్లాడాన‌ని, ఎవ‌రిప‌ట్ల వివ‌క్ష చూప‌కుండా అంద‌రినీ స‌మానంగా చూడాల‌ని తాను కోరాన‌ని గుర్తుచేశారు. అయితే తాను చేసిన వ్యాఖ్య‌ల‌ను కాషాయ నేత‌లు వ‌క్రీక‌రించి యావ‌త్ దేశం త‌న గురించి మాట్లాడుకునేలా చేశార‌ని ఆవేదన వ్య‌క్తం చేశారు. ఓ స్వామీజీ త‌న త‌ల‌పై రూ. 5-10 కోట్లు వెలక‌ట్టార‌ని అన్నారు.

Also Read : కొంపముంచిన కొటరీలు

ప్ర‌స్తుతం ఈ కేసు న్యాయ‌స్ధానం ప‌రిధిలో ఉంద‌ని, న్యాయ‌స్ధానాల ప‌ట్ల త‌న‌కు విశ్వాసం ఉంద‌ని చెప్పారు. తాను చేసిన వ్యాఖ్య‌ల‌కు క్ష‌మాప‌ణ చెప్పాల‌ని కోరార‌ని, కానీ తాను క్ష‌మాప‌ణ చెప్పేదిలేద‌ని స్ప‌ష్టం చేశాన‌న్నారు. తాను స్టాలిన్ కొడుకునని, కలైంజ్ఞర్ మనవడినని, తాను వారి భావజాలాన్ని మాత్రమే సమర్థిస్తున్నానని చెప్పాను.

for telugu news live alerts like, follow and subscribe TMedia on FacebookTwitterYouTube