పీస్ కమిటీ సమావేశం

పీస్ కమిటీ సమావేశం

1
TMedia (Telugu News) :

పీస్ కమిటీ సమావేశం
టీ మీడియా, ఏప్రిల్ 11,పెద్ద శంకరంపేట :మెదక్ జిల్లా ఎస్పీ రోహిణి ప్రియదర్శిని అదేశాల మేరకు పెద్దశంకరంపేట మండలంలోని స్థానిక పోలీస్ స్టేషన్ లో సోమవారం రోజున ఎస్సై బాలరాజు ఆధ్వర్యంలో పీస్ కమిటీ సమావేశం ఏర్పాటు చేశారు . ఈ కార్యక్రమంలో పాల్గొన్న సీఐ జార్జ్ మాట్లాడుతూ ఈ నెలల్లో జరగబోయే రంజాన్, హనుమాన్ జయంతి ,గుడ్ ఫ్రైడే, దినాలను పురస్కరించుకొని ప్రజలంతా సోదర భావంతో పండుగలు జరుపుకోవాలని అన్నారు. సోషల్ మీడియాలో మతవిద్వేషాలు రెచ్చగొట్టే వ్యాఖ్యలు చేస్తే తమ దృష్టికి తీసుకురావాలని తెలిపారు.

Also Read : 24 గంట‌ల డెడ్‌లైన్ తాడోపేడో తేల్చుకుంటాం : సీఎం కేసీఆర్

ఈ సమావేశంలో సీఐ జార్జ్, జడ్పీటీసీ విజయరామరాజు, చేనేత సహకార సంఘం మాజీ చైర్మన్ మహంకాళి కృష్ణమూర్తి, కందుకూరి రవి, కనకరాజు, సీతారామరావు దేశ్పాండే ,జైహింద్ రెడ్డి ,సలీం, ఖలీల్ ,రషీద్ ,కాంగ్రెస్ పట్టణ అధ్యక్షుడు గంగారెడ్డి వివిధ కుల సంఘాల నాయకులు,ఎఎస్సై అశోక్ కుమార్, పోలీస్ సిబ్బంది తదితరులు పాల్గొన్నారు.

for telugu news live alerts like, follow and subscribe TMedia on FacebookTwitterYouTube