గోడమీద బల్లి ఉందని గన్‌తో కాల్చాడు

గోడమీద బల్లి ఉందని గన్‌తో కాల్చాడు

1
TMedia (Telugu News) :

గోడమీద బల్లి ఉందని గన్‌తో కాల్చాడు

టీ మీడియా,ఆగస్టు 5, హైదరాబాద్‌: పాతబస్తీ మొఘల్‌పురాలోని సుల్తాన్‌షాహీలో కాల్పులు కలకలం సృష్టించాయి. సుల్తాన్‌షాహీకి చెందిన అఫ్సర్‌ అనే వ్యక్తి ఈ నెల 1న తన ఇంట్లో గోడమీద బల్లిపై కాల్పులు జరిపాడు. అయితే ఆ బుల్లెట్‌ గోడకు తగలడంతో కొంత పెచ్చు ఊడి అక్కడే ఉన్న ఆజాన్‌ అనే ఎనిమిదేండ్ల బాలుడిపై పడింది.

 

Also Read : రేవంత్‌ రెడ్డి ముఖం చూడను: ఎంపీ కోమటిరెడ్డి

 

దీంతో తీవ్రంగా గాయపడిన ఆ బాలుడిని స్థానికులు దవాఖానకు తరలించారు. వైద్యులు చికిత్స అందించడంతో అతనికి ప్రాణాపాయం తప్పింది. ఈ ఘటనపై కేసు నమోదుచేసిన పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. ఏ ఆయుధంతో కాల్పులు జరిపాడనే కోణంలో విచారణ జరుపుతున్నారు.

for telugu news live alerts like, follow and subscribe TMedia on FacebookTwitterYouTube