కమ్యూనిస్టులు వేలాది ఎకరాలు పేద ప్రజలకు పంచారు

కమ్యూనిస్టులు వేలాది ఎకరాలు పేద ప్రజలకు పంచారు

1
TMedia (Telugu News) :

కమ్యూనిస్టులు వేలాది ఎకరాలు పేద ప్రజలకు పంచారు

టీ మీడియా,సెప్టెంబర్ 13,పెనుబల్లి :మండలం లో లకపల్లి గ్రామాల తెలంగాణ సాయుధ పోరాట వార్షికోత్సవ సభ పోతిన సత్యనారాయణ అధ్యక్షతన జరిగింది ఈ సమావేశంలో సిపిఎం పార్టీ జిల్లా కమిటీ సభ్యులు చలమాల విట్టల్ రావు మాట్లాడుతూ తెలంగాణ సాయుధ పోరాటంలో భూస్వాముల÷ను కడగడలాడించి వారి వద్ద ఉన్న వేలాది ఎకరాల భూములను పేద ప్రజలకు పంచిపెట్టిన ఘనత కమ్యూనిస్టులదని అన్నారు నైజాం రజాకారులపై కరడుగట్టిన భూస్వామ్య దోపిడీపై తిరగబడ్డ వీరుల చాకలి ఐలమ్మ మల్ల స్వరాజ్యం దొడ్డి కొమరయ్య అని అన్నారు నైజాం రాజ్యంలో జమీందారులు జాకీర్దారులు దేశముక్కులు, భూస్వాముల దోపిడి సాగిందన్నారు రైతాంగం చేతివృత్తుల వారిని కట్టు బానిసలు చేశారన్నారు.

 

Also Read : శాసనసభ నుండి ఈటెల సస్పెన్షన్

వారితో వ్యతిరే చేయించడానికి వ్యతిరేకంగా కమ్యూనిస్టు పార్టీ పోరాడిందని అన్నారు సిపిఎం పార్టీ మండల కార్యదర్శి గాయం తిరుపతి రావు మాట్లాడుతూ రైతుల పండించిన పంటను దౌర్జన్యంగా దేశముఖ గుండాల ఆక్రమించినప్పుడు కమ్యూనిస్టు కార్యకర్తలు పోరాడి పంటలను రక్షించారని అన్నారు తెలంగాణ సాయుధ పోరాటంలో ఎటువంటి సంబంధం లేని బీజేపీ నాయకులు నాయకుల మాటలు హాస్యాస్పదంగా ఉన్నాయన్నారు బిజెపి విధానాలకు వ్యతిరేకంగా ఈ నెల 10 నుంచి 17 వరకు సిపిఐఎం ఆధ్వర్యంలో తెలంగాణ రైతాంగ సాయుధ పోరాట వార్షికోత్సవ నిర్వహిస్తున్నామన్నారు బిజెపి తప్పుడు విధానాలను ఎండగట్టాలని పిలుపునిచ్చారు నవంబర్ 4 5 6 తేదీల్లో తెలంగాణ వ్యవసాయ కార్మిక సంఘం రాష్ట్ర మహాసభలను జయప్రదం చేయాలని ఆయన అన్నారు ఈ కార్యక్రమంలో మండల కమిటీ సభ్యులు మిట్టపల్లి నాగమణి సభ్యులు కొర్రయ నాగమణి చింతల చిలక లక్ష్మయ్య గొల్లమందల సరసమ్మ తదితరులు పాల్గొన్నారు.

for telugu news live alerts like, follow and subscribe TMedia on FacebookTwitterYouTube